Viral Video: ట్రెయిన్‌లో ఈ యువతి ఏం చేసిందో చూడండి.. ఎవ్వరికీ కనిపించకుండా.. వెనక సీట్లో కూర్చున్న యువకుడికి..

ABN , First Publish Date - 2022-07-31T19:07:01+05:30 IST

ఓ యువతి, యువకుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో యువతి చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ము

Viral Video: ట్రెయిన్‌లో ఈ యువతి ఏం చేసిందో చూడండి.. ఎవ్వరికీ కనిపించకుండా.. వెనక సీట్లో కూర్చున్న యువకుడికి..

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువతి, యువకుడికి సంబంధించిన వీడియో(Video) ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో యువతి చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ముక్కు మొహం తెలియని వాళ్ల మాయలో పడితే.. తర్వాత బాధపడాల్సి వస్తుందంటూ హితబోధ చేస్తున్నారు. కాగా.. ఇంతకూ ఆ యువతి, యువకుడి మధ్య ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



‘అపరిచితులతో జాగ్రత్త’ అంటూ బస్‌స్టాండ్(Bus Stand), రైల్వే స్టేషన్(Railway Station) తదితర ప్రయాణ ప్రాంగణాల వద్ద అధికారులు ప్రయాణికులను ఉద్దేశించి పదే పదే ప్రకటనలు చేస్తారు. అపరిచితులను నమ్మితే విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చిరిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ యువతి మాత్రం అధికారుల మాటలను పెడచెవిన పెట్టింది. ట్రెయిన్‌లో తనతోపాటు ప్రయాణిస్తున్న యువకుడి చేష్టలకు ఇంప్రెస్  అయిపోయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (love at first sight) అంటూ.. యువకుడి గురించి పూర్తి అవగాహన లేకుండానే అతడికి తన విలువైన మనసును ఇచ్చేసింది. అంతటితో ఆ యువతి ఆగిపోలేదు. తన మనసులో ఉన్న మాటలను ఓ తెల్లని కాగితంపై(Love Letter) రాసి.. దాన్ని వెనక సీట్లో కూర్చున్న యువకుడికి ఎవ్వరికీ కనిపించకుండా ఇచ్చేసింది. ట్రెయిన్‌ రద్దీగా ఉండటంతో.. ఆ దృశ్యాలు కాస్తా కెమెరాకు చిక్కాయి. ఆ వీడియోకాస్తా నెట్టింటికి చేరడం.. వైరల్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తూ.. వారికి తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-07-31T19:07:01+05:30 IST