
హైదరాబాద్/అడ్డగుట్ట: పెళ్లి కావడంలేదని ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తుకారాంగేట్ ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. అడ్డగుట్ట లోహియనగర్కు చెందిన అనిత (36)కు వివాహం కావడం లేదు. దీంతో శనివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.