బంజారాహిల్స్‌లో యువతి కిడ్నాప్‌ కలకలం..

ABN , First Publish Date - 2021-04-01T17:28:26+05:30 IST

బంజారాహిల్స్‌లో ఓ యువతి కిడ్నా‌ప్ అయినట్లు వీడియోలు బయటకు రావడం కలకలం సృష్టించింది...

బంజారాహిల్స్‌లో యువతి కిడ్నాప్‌ కలకలం..

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : బంజారాహిల్స్‌లో ఓ యువతి కిడ్నా‌ప్ అయినట్లు వీడియోలు బయటకు రావడం కలకలం సృష్టించింది. రోడ్డు నెంబరు-03 ఆల్‌మండ్‌ హౌస్‌ వెనకాల యువతిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లినట్టు ఓ ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డు అయింది. వీడియో ఆధారంగా బంజారాహిల్స్‌ పోలీసులు విచారణ చేయగా.. కిడ్నాప్‌ జరగలేదని నిర్ధారణ అయింది. కొంతమంది మద్యం తాగి హంగామా సృష్టించినట్లు కొన్ని ఆధారాలు లభించాయి. కిడ్నాప్‌ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

Updated Date - 2021-04-01T17:28:26+05:30 IST