పెళ్లిపీటల నుంచి వరుడు పరారీ

ABN , First Publish Date - 2022-03-08T16:18:46+05:30 IST

ఆ అమ్మాయి వివాహం గురించి ఎన్నో కలలు కంది. తనకు కాబోయే భాగస్వామి దొరికాడని సంతోషించింది. అయితే సప్తపదిని పలికేందుకు కొన్ని గంటల సమయం ముందు వరుడు పరారయ్యాడు. దీంతో

పెళ్లిపీటల నుంచి వరుడు పరారీ

- వరుడి సొంతూరు చిత్తూరు జిల్లా 

- కేసు నమోదు చేసిన తాంబరం పోలీసులు 


నిమ్మనపల్లె(చిత్తూరు): ఆ అమ్మాయి వివాహం గురించి ఎన్నో కలలు కంది. తనకు కాబోయే భాగస్వామి దొరికాడని సంతోషించింది. అయితే సప్తపదిని పలికేందుకు కొన్ని గంటల సమయం ముందు వరుడు పరారయ్యాడు. దీంతో వివాహం ఆగిపోయి పెళ్లిమండపంలో విషాదం నెలకుంది. సంఘటన చెన్నై నగర పరిధిలోని తాంబరంలో జరిగింది. వరుడిది  చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం చౌకిళ్లవారిపల్లె. దీంతో తాంబరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.... నిమ్మనపల్లె మండలం చౌకిళ్లవారిపల్లెకు చెందిన వెంకటరమణ చిన్న కుమారుడు కేదార్‌నాథ్‌ (32) బతుకు దెరువు కోసం  పదిహేనేళ్ల క్రితమే చెన్నైకు వెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేస్తున్న సమయంలో చందన(25) అనే యువతితో పరిచయమై ఆది కాస్తా ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని కోరింది. తన అన్నకు వివాహం కావాలని ఆ తరువాతనే మన వివాహమని నమ్మబలికాడు. అందుకు రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి ఆమె దగ్గర తీసుకున్నాడు. అన్న పెళ్లి అయిపోయింది. ఇక మన వివాహం అంటూ ఫిబ్రవరి 21వ తేదీన ఖరారు చేశాడు. దీంతో వధువు తరపున తల్లిదండ్రులు కల్యాణమండపాన్ని బుక్‌ చేసుకున్నారు. తీరా తాళిని కట్టే  సమయంలో  పెళ్లి పీటల నుంచి పరారయ్యాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. తాంబరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తరువాత గాలించినా కేదారినాథ్‌ కనిపించక పోవడంతో సోమవారం కేదార్‌నాథ్‌ సొంతూరు చౌకిళ్లవారిపల్లెకు వధువు, బంధువులు చేరుకున్నారు. అప్పటికే ఇంటికి తాళం వేసుకొని ఇంటి నుంచి కుటుంబ సభ్యులతో సహా పరారయ్యారు. అదే ఇంటిముందు వధువు ధర్నాకి దిగింది. కేదార్‌నాథ్‌ తనను కూడా మోసం చేశాడని మరో అమ్మాయి నిమ్మనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేదార్‌నాథ్‌ను పట్టుకుని తన న్యాయం చేయాలని చందన నిమ్మనపల్లె పోలీసులను కోరింది. 

Updated Date - 2022-03-08T16:18:46+05:30 IST