బైక్‌పై వెళ్తున్న అన్న.. రోడ్డుపై ప్రియుడితో నడుచుకుంటూ వెళ్తున్న చెల్లిని చూసి సడన్‌ బ్రేక్.. అంతా చూస్తుండగానే..

ABN , First Publish Date - 2022-06-10T18:45:29+05:30 IST

ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నడుస్తోంది.. ప్రియుడి చేతిలో చెయ్యి వేసి ముందుకు వెళుతోంది..

బైక్‌పై వెళ్తున్న అన్న.. రోడ్డుపై ప్రియుడితో నడుచుకుంటూ వెళ్తున్న చెల్లిని చూసి సడన్‌ బ్రేక్.. అంతా చూస్తుండగానే..

ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నడుస్తోంది.. ప్రియుడి చేతిలో చెయ్యి వేసి ముందుకు వెళుతోంది.. ఆ సమయంలో ఆ యువతి సోదరుడు అదే రోడ్డుపై బైక్‌పై వెళుతూ ఆమెను చూశాడు.. అంతే.. బైక్ ఆపి రోడ్డుపైనే వారిపై దాడికి తెగబడ్డాడు.. చెల్లెలి బాయ్‌ఫ్రెండ్‌ను రక్తం వచ్చేలా కొట్టాడు.. చెల్లెలిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.. అయితే ఆ యువతి అన్నను ఎదురించింది.. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి ముగ్గురినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 


ఇది కూడా చదవండి..

రూ.15 లక్షల విలువైన 500 రూపాయల నోట్ల కట్టల్ని పెట్టెలో పెడితే జరిగింది ఇదీ.. సగం కాలిపోయిన స్థితిలో..


మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి గురువారం మధ్యాహ్నం నడుచుకుంటూ వెళుతోంది. అదే సమయంలో ఆ యువతి సోదరుడు అదే రోడ్డుపై వెళుతూ వారిని చూశాడు. తీవ్ర ఆగ్రహానికి గురై తన చెల్లెల్లి బాయ్‌ఫ్రెండ్‌ను నడిరోడ్డు మీదే చితక్కొట్టాడు. చెల్లెలి చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ యువతి తన సోదరుడికి ఎదురు తిరిగింది. ఆమె ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు అండగా నిలిచింది. `మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. మేం ఎక్కడికీ వెళ్లిపోవడం లేదు. రోడ్డు మీద నడుస్తున్నామంతే. నా బాయ్‌ఫ్రెండ్‌ను నా సోదరుడు తీవ్రంగా కొట్టాడు. నేను ఇంటికి వెళ్లన`ని ఆ యువతి పోలీసులకు చెప్పింది. 

Updated Date - 2022-06-10T18:45:29+05:30 IST