చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-26T05:18:02+05:30 IST

చెరువులో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం మండలంలోని దుద్దుకూరులో వెలుగు చూపింది.

చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య




ఇంకొల్లు, నవంబరు 25: చెరువులో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం  మండలంలోని దుద్దుకూరులో వెలుగు చూపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుద్దుకూరు గ్రామానికి చెందిన చిలమర మ హేష్‌(29)కు వేటపాలెంకు చెందిన కల్పనతో వివాహమైంది. కొంతకాలంగా మహేష్‌ వేటపాలెంలో జీవనం సాగిస్తున్నాడు. తరచూ భార్యను, తల్లిదండ్రులను డబ్బులు ఇ వ్వాంటూ వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం చనిపోతాను అంటూ వేటపాలెంలో ఇంటి నుంచి వచ్చాడు.  దుద్దుకూరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా గురువా రం మృతదేహం బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. భార్య కల్పన ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-11-26T05:18:02+05:30 IST