Viral Video: హెలికాప్టర్‌‌కు వేలాడుతూ ఈ యువకుడు చేసిన పనికి నోరెళ్లబెడుతోన్న నెటిజనులు..

ABN , First Publish Date - 2022-02-26T22:48:29+05:30 IST

ఓ యువకుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. హెలికాప్టర్‌కు వేలాడుతూ అతడు చేసిన పని చూసి నెటిజనం అవాక్కవుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. అతడు చే

Viral Video: హెలికాప్టర్‌‌కు వేలాడుతూ ఈ యువకుడు చేసిన పనికి నోరెళ్లబెడుతోన్న నెటిజనులు..

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువకుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. హెలికాప్టర్‌కు వేలాడుతూ అతడు చేసిన పని చూసి నెటిజనం అవాక్కవుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. అతడు చేసిందానికి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా దక్కింది. ఇంతకూ విషయం ఏంటంటే.. 



సాధారణంగా ఎవరైనా వర్కౌట్‌లు జిమ్‌లోనో లేక పార్కుల్లోనో చేస్తారు. సమయం లేక మరికొందరు ఇళ్లలోనే తమ కసరత్తులను పూర్తి చేస్తుంటారు. అయితే అమెరికాకు చెందిన రోమన్ సహ్రద్యన్ మాత్రం కొత్తగా ట్రై చేశాడు. తాను చేసిన పని గురించి నలుగురూ చెప్పుకోవాలనుకున్నాడో లేక ఇంకేమైనా ఆలోచించాడో తెలియదు కానీ ఏకంగా హెలికాప్టర్‌నే రంగంలోకి దింపాడు. హెలికాప్టర్‌కు వేలాడుతూ నిమిషంలో పుల్‌అప్స్ తీశాడు. దీంతో ఏకంగా అతడి పేరు గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి చేరింది. తాజాగా అందుకు సంబంధించిన దృశ్యాలను గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు.. అధికారిక ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పొస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.






Updated Date - 2022-02-26T22:48:29+05:30 IST