America: న్యూయార్క్ సిటీలో అదిరిపోయే స్టెప్పులేసిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-09-09T20:13:24+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఓ యువకుడు అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఆ వీడియో రెండు లక్షల మందికిపైగా వీక్షించారు. అంతేకాకుండా అతడిపై ప్రశంసలు

America: న్యూయార్క్ సిటీలో అదిరిపోయే స్టెప్పులేసిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో!

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఓ యువకుడు అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఆ వీడియో రెండు లక్షల మందికిపైగా వీక్షించారు. అంతేకాకుండా అతడిపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


న్యూయార్క్ సిటీలోని టైమ్ స్క్వైర్ వద్ద హార్దీ సింగ్ అనే యువకుడు డ్యాన్స్ చేశాడు. పాపులర్ పంజాబీ సాంగ్ అయిన Mundian Toh Bach Ke పాటకు భంగ్రా స్టైల్‌లో స్టెప్పులేశాడు. ఈ క్రమంలో అక్కడున్న ప్రజలు.. డ్యాన్స్‌ను ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా డ్యాన్సుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోపక్క హార్దీ సింగ్ కూడా తన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టా‌గ్రాం అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. 




Updated Date - 2022-09-09T20:13:24+05:30 IST