చెన్నైలో ఉద్యోగం వచ్చిందని వెళ్లాడు.. కొన్ని రోజుల తర్వాత అతని ఇన్‌స్టాగ్రామ్ చూసిన తల్లి షాక్.. వెంటనే పోలీసులను ఆశ్రయించి..

ABN , First Publish Date - 2021-12-22T18:13:38+05:30 IST

ఆ కుర్రాడి వయసు 17 సంవత్సరాలు.. కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేసిన ఆ యువకుడు గత నెలలో మానేసి ఇంటికి వెళ్లాడు..

చెన్నైలో ఉద్యోగం వచ్చిందని వెళ్లాడు.. కొన్ని రోజుల తర్వాత అతని ఇన్‌స్టాగ్రామ్ చూసిన తల్లి షాక్.. వెంటనే పోలీసులను ఆశ్రయించి..

ఆ కుర్రాడి వయసు 17 సంవత్సరాలు.. కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేసిన ఆ యువకుడు గత నెలలో మానేసి ఇంటికి వెళ్లాడు.. అనంతరం చెన్నైలో ఉద్యోగం వచ్చిందని చెప్పి ఈ నెల 6న అక్కడకు వెళ్లాడు.. రెండ్రోజుల తర్వాత ఇంట్లో వారికి టచ్‌లో లేకుండా పోయాడు.. ఇటీవల ఆ కుర్రాడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూసిన కుటుంబ సభ్యులు షాకయ్యారు.. అతను లింగ మార్పిడి చేయించుకుని స్త్రీగా మారిపోయాడు.. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. 


పుదుచ్ఛేరికి చెందిన 17 ఏళ్ల యువకుడు గత నెల వరకు స్థానికంగానే ఓ కాల్ సెంటర్ ఆఫీస్‌లో పనిచేసేవాడు. చెన్నైలో మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పి ఈ నెల 6న అక్కడకు వెళ్లాడు. వెళ్లిన రెండ్రోజుల వరకు తల్లితోనూ, అక్కతోనూ ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత వారికి టచ్‌లో లేకుండా పోయాడు. ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. ఇటీవల ఆ కుర్రాడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూసి కుటుంబ సభ్యులు షాకయ్యారు. తాను స్త్రీగా మారిపోయానని చెప్పి ఆ కుర్రాడు తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 


దీంతో ఆ యువకుడి తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకును ఎవరో కిడ్నాప్ చేసి మహిళగా మార్చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కుర్రాడి గురించి అన్వేషణ ప్రారంభించారు. 

Updated Date - 2021-12-22T18:13:38+05:30 IST