Young Man Shameful Act: గేదెపై ఓ యువకుడి అత్యాచారం.. అతడి నిర్వాకం ఎలా బయటపడిందంటే..

ABN , First Publish Date - 2022-07-26T22:02:04+05:30 IST

కామంతో కళ్లు మూసుకుపోయిన వారు వావి వరసలు పట్టించుకోకుండా ప్రవర్తిస్తుంటారు.

Young Man Shameful Act: గేదెపై ఓ యువకుడి అత్యాచారం.. అతడి నిర్వాకం ఎలా బయటపడిందంటే..

కామంతో కళ్లు మూసుకుపోయిన వారు వావి వరసలు పట్టించుకోకుండా ప్రవర్తిస్తుంటారు. మానవత్వం లేని కామ పిశాచులు మనుషులనే కాదు.. ఆఖరికి జంతువులను కూడా వదలరు. తాజాగా రాజస్థాన్ (Rajasthan)లోని ఉదయ్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రతాప్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో గేదె (Buffalo) పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఆ యువకుడు గేదెతో అసభ్యంగా ప్రవర్తిస్తుండడం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. 


ఇది కూడా చదవండి..

46 ఏళ్ల మహిళకు నెల నుంచి కడుపునొప్పి.. భరించలేక చివరకు ఆస్పత్రికి.. నోటి ద్వారా చిన్న కెమెరాను డాక్టర్లు పంపించి చూస్తే..


ఉదయపూర్‌లోని ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలనీకి చెందిన వ్యక్తి కట్టేసి ఉన్న గేదెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి చేష్టలన్నీ అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంతు సంరక్షణ అధికారులు కూడా యువకుడిపై ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-07-26T22:02:04+05:30 IST