AP News.. అనతపురం జిల్లా: పెట్రోల్ డబ్బాతో యువకుడి ఆందోళన

ABN , First Publish Date - 2022-09-07T16:09:50+05:30 IST

వజ్రకరూర్‌లో ఓ యువకుడు జీతం ఇవ్వలేదని పెట్రోల్ బాటిల్‌ (Petrol bottle)తో ఆందోళనకు దిగాడు.

AP News.. అనతపురం జిల్లా: పెట్రోల్ డబ్బాతో యువకుడి ఆందోళన

అనంతపురం జిల్లా (Anantapuram Dist.): వజ్రకరూర్‌లో ఓ యువకుడు జీతం ఇవ్వలేదని పెట్రోల్ బాటిల్‌ (Petrol bottle)తో ఆందోళనకు దిగాడు. తనకు చెల్లించాల్సిన వేతనం చెల్లించి.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రకాష్ అనే యువకుడు ఎంపీడీవో (MPDO) కార్యాలయం వద్ద నిరసన తెలిపాడు. ఉపాధిహామీ పథకంలో వజ్రకరూర్ మండలం, గడేహోతురు గ్రామ క్షేత్ర సహాయకుడిగా 11 నెలల 15 రోజులు పని చేయించుకుని జీతం చెల్లించకుండా అన్యాయంగా తొలగించారంటూ బాధితుడు ఆరోపించాడు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, పీడీ దృష్టికి తీసుకువెళ్లినా.. న్యాయం జరగలేదన్నాడు. పని  చేస్తున్నా.. జీతం రాక తాను అప్పులపాలయ్యానన్నాడు. 

Updated Date - 2022-09-07T16:09:50+05:30 IST