ప్రేయసిని తీసుకుని పారిపోతున్న ప్రియుడు.. బస్టాండ్‌లో డ్రైవర్ రావడం ఆలస్యం కావడంతో చివరకు షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2022-02-08T20:00:45+05:30 IST

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు..

ప్రేయసిని తీసుకుని పారిపోతున్న ప్రియుడు.. బస్టాండ్‌లో డ్రైవర్ రావడం ఆలస్యం కావడంతో చివరకు షాకింగ్ సీన్..!

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. సోమవారం సాయంత్రం బస్టాండ్‌కు చేరుకున్నారు.. అయితే బస్ ఎంత సేపటికీ రాలేదు.. ఆ లోపు యువతి కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు.. యువతిని ఇంటికి పంపించి యువకుడిపై దాడికి తెగబడ్డారు.. వీధుల్లో ఈడ్చుకుంటూ బెల్ట్‌తో, కర్రలతో కొట్టారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. 


మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురికి చెందిన సాబేష్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే అందుకు యువతి తరఫు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సోమవారం సాయంత్రం ఇద్దరూ బదర్వాస్ టౌన్‌కు వెళ్లేందుకు శివ్‌పుర్‌ బస్టాండ్‌కు చేరుకున్నారు. అయితే బదర్వాస్ వెళ్లే బస్ ఎంత సేపటికీ రాలేదు. 


ఈ లోపు యువతి ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె కుటంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆమె ఇద్దరు సోదరులు గోవింద్, ప్రతాప్ వెంటనే బస్టాండ్‌కు చేరుకున్నారు. సాబేష్‌ను, తమ సోదరిని పట్టుకున్నారు. సోదరిని ఇంటికి పంపేశారు. అనంతరం సాబేష్‌పై దాడికి తెగబడ్డారు. బెల్ట్, కర్రలతో కొడుతూ రోడ్లపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. 

Updated Date - 2022-02-08T20:00:45+05:30 IST