రైల్వే స్టేషన్‌లో యువకుడి స్టంట్స్.. ప్రయాణికులతోపాటు పోలీసు కూడా ఫిదా.. కానీ ఆ అధికారి ట్విస్ట్ ఇవ్వడంతో అందరూ షాక్!

ABN , First Publish Date - 2022-07-02T15:24:43+05:30 IST

అది రైల్వే స్టేషన్. అప్పుడే ఆ స్టేషన్‌కు చేరుకున్న ఎక్స్‌ప్రెస్ రైలు.. ప్లాట్‌ఫాంపై ఆగింది. ప్రయాణికులంతా ట్రైన్ ఎక్కేశారు. ఇంతలో ఓ యువకుడు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు సహా.. అ

రైల్వే స్టేషన్‌లో యువకుడి స్టంట్స్.. ప్రయాణికులతోపాటు పోలీసు కూడా ఫిదా.. కానీ ఆ అధికారి ట్విస్ట్ ఇవ్వడంతో అందరూ షాక్!

ఇంటర్నెట్ డెస్క్: అది రైల్వే స్టేషన్. అప్పుడే ఆ స్టేషన్‌కు చేరుకున్న ఎక్స్‌ప్రెస్ రైలు.. ప్లాట్‌ఫాంపై ఆగింది. ప్రయాణికులంతా ట్రైన్ ఎక్కేశారు. ఇంతలో ఓ యువకుడు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు సహా.. అక్కడే ఉన్న రైల్లే పోలీసు అధికారి కూడా అతడి ప్రదర్శనకు ఫిదా అయిపోయాడు. కానీ.. చివరిలో ఆ అధికారికి ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో యువకుడు సహా ప్రయాణికుంతా ఒక్కసారిగా షాకయ్యారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువకుడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అందులోని దృశ్యాల ప్రకారం.. సూరజ్ సింగ్ అనే యువకుడు రైల్వే స్టేషన్‌‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రాం రీల్స్ కోసం ప్లాట్‌ఫాం‌పై బ్యాక్‌ఫ్లిప్స్(Backflips) చేసి అక్కడున్న వారందనీ ఆశ్చర్యపరిచాడు. అతడి పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన వారిలో రైల్వే పోలీసు అధికారి కూడా ఉన్నాడు. కానీ చివరికి ఆ యువకుడికి అధికారి షాకిచ్చాడు. బ్యాక్‌ఫ్లిప్స్ చేసి, ఆ దృశ్యాలను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేయగానే.. యువకుడి ఫోన్‌ను పోలీసు అధికారి లాగేసుకున్నాడు. అనంతరం రైల్వే స్టేషన్‌లో వీడియోలు, ఫొటోలు తీసుకోవడం నిషేధం అంటూ ఆ ఫోన్‌ను సీజ్ చేశాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆ యువకుడి Backflips‌‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు.. ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఆ వీడియోను 7.60లక్షల మంది వీక్షించగా.. 3.45లక్షల మంది దాన్ని లైక్ చేశారు. 




Updated Date - 2022-07-02T15:24:43+05:30 IST