Visakhapatnam: యువకుడి ఆత్మహత్య... పెళ్లింట విషాదం

ABN , First Publish Date - 2022-05-11T15:35:25+05:30 IST

కాసేపట్లో పెళ్లి జరుగుతుంది అనగా పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకోవడం పెళ్లింట విషాదాన్ని నిపింది.

Visakhapatnam: యువకుడి ఆత్మహత్య... పెళ్లింట విషాదం

విశాఖపట్నం: కాసేపట్లో పెళ్లి జరుగుతుంది అనగా పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకోవడం పెళ్లింట విషాదాన్ని నిపింది. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి జై ఆంధ్ర కాలనీలో దినేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు దినేష్‌కు ఈరోజు పెళ్లి జరగాల్సి ఉండగా ఆత్మహత్య చేసుకోవడంతో జైఆంధ్ర కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Read more