Viral Video: విమానం ఎక్కాక షాకింగ్ ట్విస్ట్.. బ్యాగ్‌ను చెక్ చేయాలన్న సిబ్బంది.. భయపడుతూనే ఆ యువతి వెళ్తే..

ABN , First Publish Date - 2022-06-30T23:41:11+05:30 IST

సోషల్ మీడియాలో ప్రేమికులకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రేయసిని ఆట పట్టించేందుకు.. యువకులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు సాధారణానికి భిన్నంగా తమ ప్రియురాలికి ప్రేమ సందేశం..

Viral Video: విమానం ఎక్కాక షాకింగ్ ట్విస్ట్.. బ్యాగ్‌ను చెక్ చేయాలన్న సిబ్బంది.. భయపడుతూనే ఆ యువతి వెళ్తే..

సోషల్ మీడియాలో ప్రేమికులకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రేయసిని ఆట పట్టించేందుకు.. యువకులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు సాధారణానికి భిన్నంగా తమ ప్రియురాలికి ప్రేమ సందేశం పంపుతుంటారు. ఇప్పుడు వైరల్ అవుతోన్న వీడియోలో.. ఓ వ్యక్తి.. తన ప్రియురాలిని వినూత్న రీతిలో సర్‌ప్రైజ్ చేశాడు. ఇందుకు సబంధించిన వీడియో.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మను రాజ్ అనే వ్యక్తి తన ప్రియురాలితో పాటూ విమానంలో ప్రయాణిస్తూ ఉంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. విమానం సముద్ర మట్టానికి 30,000 అడుగుల ఎత్తులో ఉండగా, విమాన క్యాబిన్ సిబ్బంది.. మను రాజ్ ప్రియురాలిని చెక్ చేసేందుకు పిలిచారు. మీ బ్యాగ్‌లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని సమాచారం వచ్చింది.. ఒకసారి చెక్ చేయాలని చెప్పడంతో ఆమె భయపడిపోతుంది. భయం భయంగానే వారి వద్దకు వెళ్లి తన బ్యాగ్‌లోని వస్తువులను చూపిస్తూ ఉంటుంది.

ఈ పిల్ల ఏనుగుకు అతనంటే ఎంత ప్రేమ.. కీపర్‌ను చూడగానే ఏం చేసిందో చూడండి..


అయితే అప్పుడే పక్కనే పూల బొకే పట్టుకుని నిలబడి ఉన్న తన ప్రియుడిని చూస్తుంది. దీంతో ఆమెకు ఇదంతా ప్రాంక్ అని తెలిసిపోయి.. హమ్మయ్య! ఎంత భయపడిపోయానో.. అంటూ రిలీఫ్ అవుతుంది. తర్వాత సీట్లో కూర్చున్న ప్రియురాలి వద్దకు వెళ్లి.. మోకాళ్ల మీద నిలబడి, పూల బోకే ఇచ్చి లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై ప్రయాణికులు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

విమానం నుంచి సరస్సుల్లోకి దూకుతున్న చేపలు... ఇంతకీ అసలు విషయం ఏంటంటే..





Updated Date - 2022-06-30T23:41:11+05:30 IST