young woman స్పృహలోకి రాగానే పారిపోయిన స్నేహితుడు.. పార్టీ పేరు చెప్పి అతడు ఆడిన డ్రామా ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-02T21:10:46+05:30 IST

స్నేహం కోసం ప్రాణమిచ్చేవారు చాలా మంది ఉంటారు. అలాగే అదే స్నేహం పేరుతో మోసం చేసే వారు కూడా ఎంతో మంది ఉంటారు. మహిళల (women) విషయంలో ఇలాంటి మోసాలు..

young woman స్పృహలోకి రాగానే పారిపోయిన స్నేహితుడు.. పార్టీ పేరు చెప్పి అతడు ఆడిన డ్రామా ఏంటంటే..
ప్రతీకాత్మక చిత్రం

స్నేహం కోసం ప్రాణమిచ్చేవారు చాలా మంది ఉంటారు. అలాగే అదే స్నేహం పేరుతో మోసం చేసే వారు కూడా ఎంతో మంది ఉంటారు. మహిళల (women) విషయంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) లో ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది. స్నేహితుడు పిలవడంతో ఓ యువతి పార్టీకి వెళ్లింది. అక్కడికి వెళ్లిన కాసేపటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్పృహలోకి వచ్చిన కొద్దిసేపటి తర్వాత.. ఆమెకు విషయం అర్థమైంది. పార్టీ పేరుతో స్నేహితుడు చేసిన దారుణం గురించి తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం జైపూర్ (Jaipur) పరిధికి చెందిన 20ఏళ్ల యువతి స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంఐటీ చదువుతోంది. ఇటీవల కళాశాలలో సహ విద్యార్థి ధీరజ్ శర్మతో యువతికి పరిచయం ఏర్పడింది. ఒకే కళాశాలే కావడంతో అతడితో తరచూ చనువుగా మాట్లాడేది. ఈ క్రమంలో ధీరజ్.. ఆమెపై కన్నేశాడు. అవకాశం కోసం వేచి చూస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో జూలై 31న చిన్న పార్టీ ఉందంటూ యువతిని పిలిచాడు. స్నేహితుడే కావడంతో పిలిచిన వెంటనే అతని ఇంటికి వెళ్లింది.

ten years దాంపత్య జీవితం.. మధ్యలో ప్రియుడితో ప్రేమాయణం.. చివరకు ఇంత నాటకం ఆడుతుందని ఎవరూ ఊహించలేకపోయారు..


కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత.. మత్తుమందు కలిపిన శీతలపానీయాన్ని ఆమెకు అందించాడు. అది తాగిన కాసేపటికి యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ధీరజ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన ఆమెకు.. జరిగిన విషయం అర్థమైంది. దీంతో ధీరజ్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు సోమవారం సాయంత్రం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Indecent behavior on young lady: కోచింగ్‌కు వచ్చిన యువతిని.. పొలంలోని గదికి తీసుకెళ్లి.. నాలుగు నెలలుగా వీడియో తీయడమే కాకుండా...



Updated Date - 2022-08-02T21:10:46+05:30 IST