చెరువులో ఈత కొడుతున్న కుర్రాళ్ల కాళ్లకు తగిలిందో మూట.. అనుమానంతో అందరూ కలిసి దాన్ని ఒడ్డుకు తెచ్చి చూస్తే..

Published: Sat, 25 Jun 2022 21:38:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చెరువులో ఈత కొడుతున్న కుర్రాళ్ల కాళ్లకు తగిలిందో మూట.. అనుమానంతో అందరూ కలిసి దాన్ని ఒడ్డుకు తెచ్చి చూస్తే..

కొందరు యువకులు ఓ చెరువులో సరదాగా ఈత కొడుతున్నారు. ఈ క్రమంలో వారి కాళ్లకు ఓ మూట తగిలింది. అనుమానంతో అంతా కలిసి ఆ మూటను ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో ఏముందో అని అంతా కంగారుగా ఎదురు చూస్తున్నారు. చివరకు మూట తెరచి చూసి అంతా షాక్ అయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

చెరువులో ఈత కొడుతున్న కుర్రాళ్ల కాళ్లకు తగిలిందో మూట.. అనుమానంతో అందరూ కలిసి దాన్ని ఒడ్డుకు తెచ్చి చూస్తే..

ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాల్దేవారి అనే ప్రాంతంలో నివాసం ఉంటున్న 12వ తరగతి చదువుతున్న బాలిక.. జూన్ 21వ తేదీ నుంచి కనిపించలేదు. కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం తాల్దేవారి గ్రామ సమీపంలోని చెరువులో కొందరు యువకులు ఈత కొడుతున్నారు. ఆ సమయంలో వారి కాళ్లకు ఓ మూట తగిలింది.

నీ రూమ్‌కు వెళ్లి రెస్ట్ తీసుకుంటా అనగానే ఫ్రెండ్‌కు తాళం ఇచ్చాడో వ్యక్తి.. రాత్రి వెళ్లి చూస్తే తెరచి ఉన్న తలుపులు.. లోపలకు వెళ్తే..

దీంతో అంతా కలిసి మూటను ఒడ్డుకు తీసుకొచ్చి, తెరచి చూశారు. అందులో బాలిక మృతదేహం కుళ్లిపోయి ఉండడం చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో బాలికను ఎవరో హత్య చేసి, మృతదేహాన్ని పాలిథిన్ కవర్‌లో చుట్టి చెరువులో పడేసినట్లు గుర్తించారు. ఆమె మృతికి ప్రేమ వ్యవహారామా.. లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అక్కా.. నేను బతకనేమో.. తొందరగా రా.. అంటూ తమ్ముడి నుంచి ఫోన్.. డబ్బుల్లేక మూడు రోజుల తర్వాత ఆమె వచ్చి చూస్తే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

విడాకుల కేసులో షాకింగ్ తీర్పు.. భర్తకు ప్రతీ నెలా రూ.25 వేలు భరణం చెల్లించాలంటూ భార్యకు ఆదేశాలు..!Viral Video: పిల్లలను రోడ్డు దాటించడంలో.. ఈ గొరిల్లా ఎంత జాగ్రత్త తీసుకుంటుందో.. చూస్తే ఆశ్యర్యం కలుగుతుంది..videoరూ.80 లక్షల జీతాన్నిచ్చే జాబ్‌కు గుడ్‌బై.. సొంతూరికి తిరిగొస్తే.. ఇదేం పిచ్చి పని అన్నవాళ్లే ఇప్పుడు అతడి సంపాదన చూసి..Viral Video: పాముతో చెలగాటం ఆటాడు.. చివరికి చుక్కలు చూపించింది.. ఏం జరిగిందో మీరే చూడండి..videoన్యాయం చేయండంటూ రెండు చేతులూ లేని బాలిక కాళ్లతో రాసిందో లేఖ.. నేరుగా ఇంటికే వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి..40 ఏళ్ల వయసులో ఇదేం పోయేకాలం.. 14 ఏళ్ల బాలిక తండ్రికి రూ.30 వేలు ఇచ్చిమరీ..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.