పిచ్చిగా తాగి పెట్రోలు బంకులో చోరీ.. కుర్రాడిని చావబాది పరార్.. దారి మధ్యలో దొరికిపోవడంతో..

ABN , First Publish Date - 2021-07-23T03:40:23+05:30 IST

అర్థరాత్రి పెట్రోలు బంకుకు వచ్చిందో కారు. అలవాటు ప్రకారం పెట్రోలు పోయడానికి రెడీ అయిపోయాడక్కడి కుర్రాడు.

పిచ్చిగా తాగి పెట్రోలు బంకులో చోరీ.. కుర్రాడిని చావబాది పరార్.. దారి మధ్యలో దొరికిపోవడంతో..

ఇంటర్నెట్ డెస్క్: ఎంత పెట్రోలు ధరలు పెరిగితే మాత్రం.. పెట్రోలు బంకుకే కన్నం వేస్తారా? కానీ అలాగే చేయబోయారు ఇద్దరు యువకులు. ఫుల్లుగా మందుకొట్టి ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియనంతగా ఒళ్లు మరిచి ఈ పిచ్చి చేష్టకు పాలుపడ్డారు.

అర్థరాత్రి పూట పెట్రోలు బంకుకు వచ్చిందో కారు. అలవాటు ప్రకారం పెట్రోలు పోయడానికి రెడీ అయిపోయాడక్కడి కుర్రాడు. అయితే కారులో నుంచి దిగిన ఇద్దరు యువకులకు కావలసింది పెట్రోలు కాదు. దీంతో తమ వద్దకు వచ్చిన బంకు కుర్రాడిని పట్టుకొని అతని వద్ద ఉన్న డబ్బులు ఇచ్చేయాలని బలవంతం చేశారు. దానికి ఆ కుర్రాడు నిరాకరించడంతో ఇద్దరూ కలిసి ఆ కుర్రాడిని చావబాదారు. వారి వద్ద నుంచి మద్యం వాసన ముక్కులు పగిలేలా వస్తోంది. దెబ్బలు తింటున్న కుర్రాడి కేకలు విన్న పెట్రోలు బంకు అధికారి.. వెంటనే బయటకు వచ్చాడు. అంతే అతనిపైకి పరిగెత్తారా యువకులిద్దరూ.


తనవైపు దూసుకొస్తున్న యువకులను చూసి వెంటనే బంకు ఆఫీసులోకి వెళ్లిన ఆ అధికారి.. తలుపులు బిగించేశాడు. దీంతో ఆ ఆఫీసు అద్దాలు పగలగొట్టారు దుండగులిద్దరూ. ఇంతలో చుట్టుపక్కల ప్రజలు ఇదంతా గమనించి అక్కడకు చేరుకున్నారు. వారిని చూసిన నిందితులిద్దరూ వెంటనే కారులో దూరి పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు అదృష్టం బాగలేదు. కారును అడ్డుకున్న గ్రామస్థులు ఇద్దరు యువకులనూ చావబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని యువకులిద్దరినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే వాళ్లు పోలీసులతో కూడా గొడవకు దిగారు. పెట్రోలు బంకు సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను యశ్వంత్ మీణా, నరేష్ సోనీలుగా గుర్తించారు.

Updated Date - 2021-07-23T03:40:23+05:30 IST