యువత డ్రగ్స్‌కు బానిస కావద్దు

ABN , First Publish Date - 2022-06-27T06:29:03+05:30 IST

యువత డ్రగ్స్‌కు బానిస కావద్దని ఎస్పీ సింధు శర్మ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్స వాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సిం ధు శర్మ ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు.

యువత డ్రగ్స్‌కు బానిస కావద్దు
మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేస్తున్న సిబ్బంది

జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ

జగిత్యాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం

ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, మానవ హారం

జగిత్యాల టౌన్‌, జూన్‌ 26: యువత డ్రగ్స్‌కు బానిస కావద్దని ఎస్పీ సింధు శర్మ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్స వాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సిం ధు శర్మ ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2021లో జిల్లాలో గంజాయికి సంబంధించి 14 కేసులు నమోదు చేసి 38 మందిని అరెస్టు చేయడంతో పాటు 30.165 కిలోల గంజాయి సీజ్‌ చేశామన్నారు. 2022 లో ఇప్పటి వరకు జిల్లాలో 06 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్టు చేయడంతో పాటు 11.20 కిలోల గంజాయి, 11 గంజా మొక్కలు సీజ్‌ చే శామన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

అవగాహన ర్యాలీ, మానవ హారం..

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించు కుని జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ నుండి కొత్త బస్టాండ్‌ వర కు గంజాయిని నిర్మూలించాలని కోరుతూ ఎన్‌సీసీ, ఆశా కార్యకర్తల ఆధ్వ ర్యంలో నిర్వహించిన అవడాహన ర్యాలీని ఎక్సైజ్‌ ఏడీ ఎస్పీ చంద్రబాను నాయక్‌ ప్రారంభించారు. అనంతరం కొత్త బస్‌స్టాండ్‌ వద్ద విధార్థులు సిబ్బంది మానవహారంగా ఏర్పడి మాదక ద్రవ్యాల నివారణ కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ నిర్వహించారు. జగిత్యాలకు చెందిన సామాజిక కార్య కర్త తవుటు రామచంద్రం ఆధ్వర్యంలో రూపోందించిన మాదక ద్రవ్యాల నివారణ కరపత్రాలను ఎక్సైజ్‌ అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో ఎక్సైజ్‌ సీఐ ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు.


Updated Date - 2022-06-27T06:29:03+05:30 IST