Advertisement

క్రీడల్లో యువత రాణించాలి

Jan 24 2021 @ 00:22AM
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న పుట్ట మధు

- జడ్పీ చైర్మన్‌

మంథని, జనవరి 23:యువత క్రీడలు, విద్యాలో ఉన్నతంగా సమాజసేవలో త రించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. స్థానిక ప్రభుత్వ క్రీడా మైదానంలో ముత్కు నరేష్‌ స్మారకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా పుట్ట మ ధు మాట్లాడుతూ.. క్రీడల వలన యువతకు శారీరక, మానసికోల్లాసం కలుగు తుందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, జెడ్పీటీసీ తగరం సుమలత-శంకర్‌లాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, బిట్టు శ్రీను, వీకే  రవి, ఆర్గనైజర్లు కాపు అనిల్‌, బోగే రాజు, బండ బానేష్‌, మచ్చ రమేష్‌, గుజ్జుల శ్రీకాంత్‌, క్రీడాకాలు పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement