22 ఏళ్ల కుర్రాడు.. YouTube లో చూసి ఏకంగా రూ.10 కోట్ల విలువైన చోరీ.. పోలీసులకు దొరక్కుండా పక్కా స్కెచ్

ABN , First Publish Date - 2021-12-22T06:29:52+05:30 IST

తమిళనాడులోని వెల్లూరులో గత వారం ఒక నగల షాపులో జరిగిన భారీ దొంగతనం స్థానికంగా కలకలం రేపింది. ఈ దొంగతనంలో దాదాపు 15 కిలోల బంగారు ఆభరణాలు చోరి అయ్యాయి. దొంగతనం సమయంలో దొంగ ఒక సింహం ముఖం ఉన్న మాస్కు ధరించి ఉండడంతో పోలీసులు అతడి గుర్తింపు తెలుసుకొని పట్టుకోవడానికి చాలా కష్ట...

22 ఏళ్ల కుర్రాడు.. YouTube లో చూసి ఏకంగా రూ.10 కోట్ల విలువైన చోరీ.. పోలీసులకు దొరక్కుండా పక్కా స్కెచ్

తమిళనాడులోని వెల్లూరులో గత వారం ఒక నగల షాపులో జరిగిన భారీ దొంగతనం స్థానికంగా కలకలం రేపింది. ఈ దొంగతనంలో దాదాపు 15 కిలోల బంగారు ఆభరణాలు చోరి అయ్యాయి. దొంగతనం సమయంలో దొంగ ఒక సింహం ముఖం ఉన్న మాస్కు ధరించి ఉండడంతో పోలీసులు అతడి గుర్తింపు తెలుసుకొని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఆరు రోజులుగా దాదాపు 200 సీసీటీవి వీడియోలు పరిశీలించి చివరికి దొంగ కూచియాపాళెం గ్రామానికి చెందిన టికె రామన్‌(22)గా గుర్తించారు. అతడు దొంగతనం చేసిన ఆభరణాలు దాదాపు రూ.8 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆ ఆభరణాలన్నీ ఒక శ్మశానంలో దాచిపెట్టాడని పోలీసుల విచారణలో తేలింది. 


దొంగతనం ఎలా చేశాడంటే..

వెల్లూరులోని జోస్ అలుక్కాస్ అనే బంగారు నగల షాపు నుంచి రామన్ ఈ భారీ దొంగతనం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. దొంగతనానికి ముందు రామన్ బంగారు షాపుని బాగా పరిశీలించాడని.. ఆ తరువాత షాపు వెనుక భాగంలో సీసీటీవి కెమెరాలు లేవని గమనించి.. అక్కడ గోడకు ఏడు రోజులపాటు మెల్లగా రంధ్రం వేశాడు. దీంతో షాపు బయట ఉన్న సెక్యూరిటీకి రంధ్రం వేసేటప్పుడు శబ్దం రాలేదు. దొంగ షాపు లోపల ప్రవేశించి అక్కడ ఉన్న 12 కెమెరాలకు స్ప్రే పెయింట్ వేశాడు. అందువల్ల కెమెరాలతో ఏమీ సరిగా చూడలేకపోయారు. కానీ అతడు దొంగతనం చేసి ఎటువైపు వెళ్లాడో తెలుసుకోవడానికి పోలీసులు నగరంలో దాదాపు 200 సీసీటీవి వీడియోలను పరిశీలించి.. చివరికి పక్క గ్రామంలో నివసించే టికె రామన్‌ అనే వ్యక్తి దొంగతనం చేశాడని గుర్తుపట్టారు.


దొంగని పట్టుకొని దొంగతనం ఎలా చేశావని ప్రశ్నిస్తే.. అతను యూట్యూబ్ చూసి దొంగతనానికి ప్లానింగ్ చేశానని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాకయ్యారు. కెమెరాలు పనిచేయకుండా ఉండడానికి వాటిపై స్ప్రే చల్లాడు. అలాగే షాపు వెనుక భాగంలో ఉన్న గోడను పగలగొట్టడానికి సామాన్లు, బంగారం కరిగించడానికి వాడే పరికరాలు.. ఇలా దొంగతనం చేసేందకు అతను  పూర్తిగా సిద్ధమై వచ్చాడు. దొంగతనం చేశాక ఆ బంగారు ఆభరణాలను ఒక శ్మశానంలో దాచాడు. ప్రస్తుతం  రామన్‌ని పోలీసులు అరెస్టు చేసి అతనిపై దొంగతనం కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-12-22T06:29:52+05:30 IST