Advertisement

భద్రాద్రి జిల్లాలో ఉన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి

Oct 30 2020 @ 08:02AM

భద్రాద్రి: ఎన్నికఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. విచక్షణ మరచి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇల్లందులో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. యువతిపై ఘాతుకానికి తెగబడ్డాడు. యువతి భద్రు సౌజన్యపై యువకుడు జక్కుల సందీప్ కత్తితో దాడి చేశాడు. యువతికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వ్యవహారమే కారణంగా స్థానికుల ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.