Kurnool: పెళ్లి రద్దు... యువతి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-04-28T13:29:24+05:30 IST

పెళ్లి రద్దు కావడంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

Kurnool: పెళ్లి రద్దు... యువతి ఆత్మహత్యాయత్నం

కర్నూలు: పెళ్లి రద్దు కావడంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. గ్రహబలం బాగోలేదంటూ పెద్దలు పెళ్లిని రద్దు చేశారు. ఓ యువతి యువకుడికి ఏడాది క్రితమే ఘనంగా నిశ్చితార్థం జరిగింది. వివాహంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సదరు యువతి ఏడాది గడిచినప్పటికీ పలు కారణాలతో  వివాహం రద్దు అవడంతో మనస్తాపానికి గురైంది. దీంతో శానిటైజర్ తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు యువతిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-28T13:29:24+05:30 IST