మక్కా: సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా నగరంలో ఓ సూట్‌కేసులో యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టించింది. మక్కాలోని నాల్గో రింగ్ రోడ్డు సమీపంలో ఓ వ్యక్తికి అనుమానాస్పదంగా పెద్ద సూట్‌కేసు కనిపించడంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. అతని సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు... ఆ సూట్‌కేసును తెరిచిచూడగా యువతి మృతదేహం కనిపించింది. మృతదేహంతో పాటు లభ్యమైన కొన్ని ధృవీకరణ పత్రాల ఆధారంగా మృతురాలిది ఇండోనేషియా అని, ఆమె వయసు 24 ఏళ్లని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.