పబ్‌లో మహిళతో యువకుడు అసభ్య ప్రవర్తన

Jul 2 2021 @ 12:50PM
File photo

హైదరాబాద్ : పబ్‌లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 36లోని కెమిస్ట్రీ పబ్‌కు బుధవారం ఓ మహిళ భర్తతో కలిసి వెళ్లారు. రెస్ట్‌రూమ్‌కు వెళ్లాక ఓ యువకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని భర్తకు, పబ్‌ నిర్వాహకులకు చెప్పింది. పబ్‌ నిర్వాహకుడు యువకుడిని పట్టుకొని జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. అతడు వెంగళరావునగర్‌కు చెందిన మహేష్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.