Interviewకు వెళ్తున్నానని చెప్పిన యువకుడు.. ఎన్నిసార్లు Phone చేసినా తీయకపోవడంతో.. బైక్‌లో ఉన్న బ్యాగ్‌ పరిశీలించగా..!

ABN , First Publish Date - 2021-10-30T15:59:42+05:30 IST

ఆ రోజు సాయంత్రం వరకు ఎంతకీ తిరిగి రాలేదు. ఫోన్‌ చేసినా ఎత్తడం లేదు. అనిల్‌కు ఫోన్‌చేయగా..

Interviewకు వెళ్తున్నానని చెప్పిన యువకుడు.. ఎన్నిసార్లు Phone చేసినా తీయకపోవడంతో.. బైక్‌లో ఉన్న బ్యాగ్‌ పరిశీలించగా..!

హైదరాబాద్ సిటీ/మల్కాజిగిరి: జీకే కాలనీకి చెందిన అన్నప్రగడ అనిల్‌కుమార్‌ (30) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. భార్య శ్వేతతో బుధవారం (ఈనెల27న)  ఇంటర్వ్యూనకు వెళుతున్నానని, తన వెంట ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటున్న అతడి కజిన్‌ అనిల్‌ ఉన్నాడని తెలిపాడు. ఆ రోజు సాయంత్రం వరకు ఎంతకీ తిరిగి రాలేదు.  ఫోన్‌ చేసినా ఎత్తడం లేదు. అనిల్‌కు ఫోన్‌చేయగా తన వద్దకు రాలేదని, అసలు ఇంటర్వ్యూ ఉన్న విషయం తెలియదని చెప్పాడు. గురువారం ఆయన బైక్‌ను పరిశీలించగా  బ్యాగ్‌లో ఓ లెటర్‌ లభించింది. ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెందానని, అందుకే తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని అందులో ఉంది. వెంటనే అతడి భార్య శ్వేత నేరేడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Updated Date - 2021-10-30T15:59:42+05:30 IST