ltrScrptTheme3

HYD : ప్రేమ పేరుతో యువకుడి దారుణం

Jul 16 2021 @ 09:14AM

  • బాలికపై లైంగికదాడి
  • మరో ఇద్దరిపై అనుమానం 
  • వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

హైదరాబాద్ సిటీ/వనస్థలిపురం : ఓ బాలికపై యువకుడు లైంగికదాడి చేసిన సంఘటన వనస్థలిపురం పీఎస్‌ పరిధిలో వెలుగుచూసింది. నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక (13)ను ప్రేమ పేరుతో లోబర్చుకున్న యువకుడు పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో వనస్థలిపురం కాంప్లెక్స్‌ వద్ద నడుచుకుంటూ వెళుతున్న బాలికను సదరు యువకుడు బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొనివెళ్లి లైంగికదాడి చేసి ఉదయం వదిలేశాడు. ఇదే విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడితోపాటు మరో ఇద్దరు కూడా లైంగికదాడి చేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

Follow Us on:

హైదరాబాద్మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.