నీ బాట అనుసరణీయం

ABN , First Publish Date - 2020-10-02T06:01:01+05:30 IST

విపత్కర సమయాన అరవిరిసిన ముద్దమందారంలా స్వరాజ్య ఉద్యమ...

నీ బాట అనుసరణీయం

విపత్కర సమయాన

అరవిరిసిన 

ముద్దమందారంలా

స్వరాజ్య ఉద్యమ 

సింధువులో

శాంతి సహనాలు

విపంచికలుగా చేసుకొని

బానిస బతుకులలో

అలసిన మనసులలో

బోసినవ్వులతో 

అమృతాన్ని చిలికించి

జాతిని ఏకతాటిపై నిలిపి

శ్వేతజాతి గుండెల్లో మంచుపిడుగై

అహింసా శస్త్రంతో

నిరంకుశ పర్వతాన్ని 

పెకిలించి

సత్యమనే క్షిపణితో

బానిస సంకెళ్ళు తెంచి

స్వేచ్ఛా భారతిని సాక్షాత్కరింపచేసి

మలయజ సమీరంలా

జనులను సేదదీర్చి

కుసుమవస్త్రాలు పరచిన

నీ మార్గం...

సృష్టి ఉన్నంతవరకు అమరం

అందుకే ఓ మహాత్మా!

ఓ మహర్షీ!

జాతి మరువదు నిన్ను

ఎన్ని తరాలయినా!

ఎన్ని యుగాలైనా!

వేమూరి శ్రీనివాస్

Updated Date - 2020-10-02T06:01:01+05:30 IST