త్రిభువన్‌కి తోడు నిలుద్దాం... చిరునవ్వుల లోకంలోకి తీసుకువద్దాం

Apr 15 2021 @ 18:42PM

ఏ కుటుంబానికైనా నిజమైన సంతోషం పిల్లల నుంచే వస్తుంది. ఆ చిన్నారుల అల్లరి, బోసి నవ్వులు ఆ చుట్టూ ఉన్న వారందరిలోనూ ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి. కానీ ఆ చిన్నారులను ప్రాణాంతక వ్యాధి ఏదైనా పట్టి పీడిస్తుంటే ఆ పరిస్థితి ఎంత దారుణమైనదో కదా... నా కొడుకు త్రిభువన్ కథ ఇదే. నా కలల పంట అయిన వీడిప్పుడు పొత్తికడుపులో ఇన్ఫెక్షన్ (Abdominal Infection), పేగుల్లో సమస్యలు (Intestinal Blockage)తో తీవ్రంగా బాధపడుతున్నాడు.


త్రిభువన్ నాకు మొదటి పిల్లాడు. నా కంటి దీపం. నిండైన కళ్ళతో... ముఖంలో అమాయకత్వం నిండి ఎంతో ముద్దొస్తుంటాడు. మిల మిల మెరుస్తుండే నా పిల్లవాడి కళ్ళు ఇప్పుడు వెలవెలబోతూ వెలుగు కనిపించని చీకటి రోజుల్ని తలపిస్తున్నాయి.


మా అబ్బాయి నాసికా రంధ్రాల్లో ట్యూబులు... ఒళ్ళంతా పొడిచిన ఇంజెక్షన్లు చూస్తుంటే ఎంత బాధ కలుగుతోందో చెప్పలేను. త్రిభువన్‌కు 2018లోనే పొత్తికడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలిసింది. వాడి శరీరం పసుపుపచ్చగా ఉండేది. నీళ్ళ విరోచనాలు అవుతుండేవి.


ఈ లక్షణాలతో మా అబ్బాయి ఆరోగ్యం బాగా దిగజారిపోయింది. కడుపు వాచి, రక్తపు వాంతులు అయ్యేవి. నా కొడుకును అలా చూడటం కలచివేసింది. ఆ పసివాడు ఎంత వేదన పడుతున్నాడో... ఆ తర్వాత వాడికి కాలేయానికి సంబంధించిన వ్యాధి రావడంతో 2019లో కాలేయ మార్పిడి కూడా చేయించాము.


ఈ ఆపరేషన్‌కి డబ్బు కోసం బ్యాంక్ నుంచి నా భర్త పెద్ద మొత్తంలో అప్పు చేసి ఉన్నంతలో మంచి వైద్యం అందేలా చూశాడు. వాయిదాల్లో ఈ అప్పు తీర్చడానికి మా ఆయన రేయింబవళ్ళు శ్రమపడుతున్నాడు.


మా జీవితంలో అత్యంత కష్టనష్టాల కాలం ముగిసిందని అనుకున్నాం. మరిన్ని సమస్యలు వచ్చిపడతాయని మేం ఏ మాత్రం ఊహించలేదు. కానీ దురదృష్టవశాత్తు మా పరిస్థితులు ఇంకా క్షీణించాయి. మా అబ్బాయికి పొత్తికడుపులో సమస్య తలెత్తింది.చిన్నారి త్రిభువన్ సర్జరీకి పెద్ద మనసుతో విరాళమివ్వండి... ఆ చిన్నారిని చిరునవ్వుల లోకంలోకి తీసుకురండి.


మా అబ్బాయి అప్పుడప్పుడే నడవడం నేర్చుకుంటున్నాడు... చిన్నప్పుడే పెద్ద ఆరిందాలా మాట్లాడటం మొదలుపెట్టాడు. కానీ, ఈ రోగం వాడి ముచ్చట్లన్నిటినీ దూరం చేసింది. సమయమంతా ఆసుపత్రులోనే గడిచిపోవడంతో వాడి బాల్యం ఆగిపోయినట్టు అనిపిస్తోంది. ఇదంతా చూస్తూ నాకు కలుగుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. కానీ ఎక్కడో చిన్న ఆశ.....


నా భర్త సంపాదన ఆ నెలకు మాత్రం సరిపోయే పరిస్థితి. ఉన్న ఆశ కూడా అడుగంటిపోతుందేమోనని భయం వేస్తోంది.


త్రిభువన్‌కి ఆపరేషన్ చేయించడానికి మాకిప్పుడు కనీసం రూ.6 లక్షలు ($ 8272.70) అవసరం.


ఇప్పటివరకూ నేను, నా భర్త మా శక్తి మేరకు మా అబ్బాయి చికిత్స, మెడిసిన్స్ ఖర్చు ఎలాగో భరిస్తూ వచ్చాము. ఇక పరిస్థితి మా చేయి దాటిపోయింది. త్రిభువన్‌ని కాపాడుకోవడానికి మీ సహాయం ఆశించక తప్పడం లేదు.


ఉదార హృదయంతో మీరిచ్చే విరాళాలతో త్రిభువన్‌కు సర్జరీ చేయించి, ఆ చిన్నారిని తిరిగి బోసినవ్వులతో ఆ తల్లిదండ్రులకు అప్పగిద్దాం. ఆ అబ్బాయి ఆటపాటలకు అండగా నిలుద్దాం. నేడు అనారోగ్యంతో బాధపడుతున్న ఈ బాలుడు రేపు ఈ ప్రపంచమే గర్వపడేలా ఎదిగే అవకాశముంది. కానీ, అందుకు ఉన్న ఏకైక మార్గం మీ చల్లని మనస్సు... మీ చేయూత.Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.