మూగబోయాయి..!

Jun 17 2021 @ 00:22AM
జిల్లాకేంద్రంలోని మెప్మా కార్యాలయం

  రెండు నెలలుగా పనిచేయని మెప్మా సిబ్బంది ఫోన్లు
  బిల్లులు చెల్లించకపోవడమే ప్రధాన కారణం
 అయోమయం అవుతున్న మహిళా సంఘాలు, ప్రజలు

రామగిరి జూన 16 :
మెప్మా సిబ్బంది ఫోన్లు రెండు నెలలుగా పనిచేయకపోవడంతో మహిళా సంఘాలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హెచఆర్‌ పాలసీ ప్రకారం ఎవరి బిల్లు వారే కట్టుకోవాలని సూచిస్తుండగా ఉద్యోగులు మాత్రం ఇప్పటి వరకు సంస్థ చెల్లించిదంటూ పేర్కొంటున్నారు. దీంతో ఉద్యోగుల ఫోన్లు పనిచేయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మెప్మా) జిల్లా కార్యాలయంలో పని చేస్తున్న 22మంది సిబ్బందికి ఆ శాఖ ఆధికారులు అధికారిక సెల్‌ సిమ్‌లు ఇచ్చారు. అయితే వాటికి సంబంధించిన బిల్లులు  ముడు నెలల క్రితం వరకు డిపార్ట్‌మెంటే చెల్లించేది. అప్పుడు అందరి ఫోన్లు పనిచేసేవి. సిబ్బందికి వేతనాలు ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా చెల్లించేవి. అప్పుడు వీరికి ఈ శాఖనే సెల్‌ఫోన బిల్లు అదనంగా చెల్లించేది. అయితే ప్రస్తుతం ఉద్యోగులు హెచఆర్‌ పరిధిలోకి వచ్చినందున మూడు నెలలుగా ఈ విధానం మారింది. ఈ సిమ్‌లను ఉపయెగిస్తున్న వీరికి హెచఆర్‌ పాలసీ ప్రకారం మెప్మా ప్రధాన కార్యలయం నుంచే వేతనాలు అందుతున్నాయి. వేతనాల చెల్లింపు ప్రక్రియలోనే సెల్‌ఫోన బిల్లు సైతం అదనంగా  జమ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎవరికి వారు సెల్‌ఫోన బిల్లు చెల్లించుకోవాల్సి వస్తోంది.
అయోమయంలో ఉద్యోగులు
హెచఆర్‌ పరిధిలోకి వచ్చిన ఈ ఉద్యోగులు కొంతమంది సెల్‌ఫోన బిల్లు చెల్లించే విషయంలో ఇంకా అయోమయంలోనే ఉన్నారు.  ముడు నెలల క్రితం వరకు ప్రభుత్వమే బిల్లు చెల్లించినందున ప్రస్తుతం సైతం  ప్రభుత్వమే చెల్లింస్తుంద న్న ధోరణిలో హెచఆర్‌ పరిధిలోకి వచ్చిన సిబ్బంది ఉన్నారు. కాని తాము మెప్మా ఉన్నత కార్యాలయం నుంచి వేత నాలు తీసుకుంటున్నాము వేతనాల చెల్లింపు ప్రక్రియలోనే సెల్‌ఫోన బిల్లు ఉంటుందన్న విషయాన్ని మాత్రం గ్రహించట్లేదు. మారిన హెచఆర్‌ పాలసీ ప్రకారం ఎవరికి వారే సెల్‌ఫోను బిల్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అధికారులైన చెప్పాల్సి ఉండేది. కాని అధికారులు చెప్పకపోవ డం.. వీరు గ్రహించకపోవడం ములంగా ఈ 22మంది ఉద్యోగుల సిమ్‌లు నెల రోజులుగా పనిచేయడం లేదు.
ఇబ్బందుల్లో మహిళా సంఘాలు, ప్రజలు
 మెప్మా కార్యాలయంలో డీఎంసీ(డిస్టిక్‌ మిషన కోఆర్డినేటర్‌), టీఎంసీ (టౌన మిషన కోఆర్డినేటర్‌), సీవో (కమ్యునిటి ఆర్గనైజర్‌) అనే ఉద్యోగులు ఉంటారు. వీరు ప్రభుత్వం నుంచి వచ్చే మహిళా సంఘాల రుణా లు, వివిఽఽధ సంక్షేమ పథకాలు ఆర్‌పీ (రీసోర్సపర్సన)తో, మహిళా సంఘ నాయకురాళ్లతో ప్రజలకు చేరవేస్తుంటారు. అయితే వీరితో పట్టణ ప్రజలకు మహిళా సంఘాలతో, బ్యాంకు అధికారులతో సత్సంబందాలు ఉం టాయి. అనునిత్యం రుణాల మంజూరు, రికవరీ విషయలపై చర్చించాల్సిన అవసరం ఉంటుంది. కానీ నెల రోజులగా వీరి ఫోన్లు పనిచేయకపోవడంతో మహిళా సంఘాలు, బ్యాంకు సిబ్బంది, ప్రజలు తీవ్ర ఇబ్బ ందులు ఎదుర్కొంటున్నారు. వీరిని సంప్రదించేందుకు ఏ నెంబరకు చే యాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఒకరిద్దరు ఉద్యోగులు   బిల్లు చెల్లించినా వారి నెంబర్లు యాక్టివేట్‌ కాకపోవడం గమనార్హం.
ఎవరి బిల్లు వారు చెలించుకోవాల్సిందే

- మెప్మా ఏవో ప్రవీణ్‌ కుమార్‌
మోప్మా ఉన్నత శాఖ కార్యాలయం నుంచి వేతనాలు తీసుకునే ఉద్యోగులందరు ఎవరి బిల్లు వారు చెల్లించుకోవాల్సిందే. వేతనంలోనే సెల్‌ఫోన బిల్లు అదనంగా వస్తుంది. సెల్‌బిల్లు చెల్లించుకోకుండా ప్రజలను ఇబ్బందులను గురి చేసే ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు ఉంటాయి. 

Follow Us on: