బైక్‌పై ప్రియురాలితో కలిసి స్టంట్లు.. అదుపు తప్పడంతో ఎంత ఘోరం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-12-24T22:47:09+05:30 IST

రాత్రివేళ నడిరోడ్డుపై ప్రియురాలితో కలిసి ప్రమాదకర స్టంట్లు చేశాడు

బైక్‌పై ప్రియురాలితో కలిసి స్టంట్లు.. అదుపు తప్పడంతో ఎంత ఘోరం జరిగిందంటే..

రాత్రివేళ నడిరోడ్డుపై ప్రియురాలితో కలిసి ప్రమాదకర స్టంట్లు చేశాడు.. బైక్ ముందు చక్రాన్ని గాల్లోకి లేపాడు.. అయితే వేగం పెరిగిపోయి కంట్రోల్ తప్పిన బైక్ పల్టీలు కొట్టింది.. రోడ్డుపై పడి 20 అడుగుల దూరం వరకు వెళ్లిపోయింది.. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. 


ముంబైకి చెందిన యువకుడు తన ప్రేయసిని చూసేందుకు బుధవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లాడు. ఆమెను బైక్‌పై ఎక్కించి నగరమంతా తిప్పాడు. రాత్రి సమయంలో రోడ్డు కాస్త ఖాళీగా కనిపించడంతో స్టంట్లు చేయడం ప్రారంభించాడు. బైక్‌ను హై స్పీడ్‌లో పోనిస్తూ ముందు టైర్‌ను గాలిలోకి లేపేందుకు ప్రయత్నించాడు. అయితే సమయానికి బ్రేక్ వేయలేకపోవడంతో బైక్ పల్టీలు కొట్టింది. 20 అడుగుల దూరం వరకు ఆ యువకుడిని ఈడ్చుకుపోయింది. దీంతో ఆ ఇద్దరూ తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. 

Updated Date - 2021-12-24T22:47:09+05:30 IST