రాజమహేంద్రవరం సిటీ, మార్చి 27: హీరో రామ్‌చరణ్ పుట్టిన రోజు వేడుకలు చిరంజీవి యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడిద బాబి ఆధ్వర్యంలో ఆది వారం రాజమహేంద్రవరం ధన్వంతరి బ్లడ్ బ్యాంక్‌లో జరిగాయి. ఈ సందర్భం గా 56 మంది యువకులు రక్తదానం చేశారు. దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యఅతిథిగా విచ్చేసి యువకులను అభినందించారు. కార్యక్రమంలో వానపల్లి ఆంజనేయులు, నాళం వరప్రసాద్, ఎస్కే బాబా, దొడ్డి జానీ, జెట్టి చరణ్ పాల్గొన్నారు. అలాగే రాజమహేంద్రవరంలో రామ్‌చరణ్ అభిమానులు అన్నదానాలు, దివ్యాంగులకు ఆహారం పంపిణీ చేశారు. గోదావరి మధ్యలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో జనసేన కార్పొరేషన్ అధ్య క్షుడు వై.శ్రీనివాస్ పాల్గొన్నారు. వీఎల్ పురం సమీపంలో ఎక్ట్రీమ్ కార్ వాష్ వద్ద రామచరణ్ ఫొటో చిత్రాన్ని 20 అడుగుల ఆర్ట్‌గా మలచి అభిమాన్ని చాటుకున్నారు. రామ్‌చరణ్ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీ చలపతిరాజు ఆధ్వర్యంలో స్థానిక గౌతమీ జీవకారుణ్య సంఘానికి జనసేన నాయకుడు వై.శ్రీనివాస్ వాటర్ ఫిల్టర్ అందజేశారు. సురేష్, స్వాయి స్వరూప్, కోన హేమంత్, భాష, బషీర్, గాడాల శ్రీను పాల్గొన్నారు. స్థానిక అశోక థియేటర్ వద్ద పడాల శ్రీను ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యర్రా వేణుగోపాలరాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వృద్ధులకు దుప్పట్లు, పేదలకు ఆహారం అందించారు. కార్యక్రమంలో సబ్బెళ్ళ నాగరమేష్, రాఘవేంద్ర, రాజేష్, కేవి సత్యనారాయణ, బుగ్గా బాసి, సాయి, కొయ్యన కుమారి, సీతాలక్ష్మి పాల్గొన్నారు.