జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగుల నిరసనలు

ABN , First Publish Date - 2021-06-23T05:38:38+05:30 IST

‘ఉద్యోగాల విప్లవం’ పేరిట సర్కారు విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగులు మండిపడు తున్నారు.

జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగుల నిరసనలు
ఏలూరులో జాబ్‌ క్యాలెండర్లను దహనం చేస్తున్న నిరుద్యోగులు

ఏలూరు ఫైర్‌స్టేషన్‌/నల్లజర్ల/నరసాపురం, జూన్‌ 22 : ‘ఉద్యోగాల విప్లవం’ పేరిట సర్కారు విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగులు మండిపడు తున్నారు. దీనిని తక్షణం రద్దుచేసి మొత్తం ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరుద్యోగులు ఆందో ళనలు చేశారు. ఉద్యోగాలంటూ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఏలూరు పార్లమెంటు టీఎన్‌ ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు పెనుబోయిన మహేష్‌యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద జాబ్‌ క్యాలెండర్‌ జీవో 39 ప్రతులను దహనం చేశారు. ఆందోళనలో కె.వర్దన్‌, ఎం.సూర్య, శైలేష్‌, అనిల్‌, చందు, షేక్‌ బాజీ, ఫణి, ఎ.సందీప్‌ పాల్గొన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ను రద్దు చేసి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని టీఎస్‌ఎన్‌ఎఫ్‌ రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అధ్యక్షుడు పాతూరి సహృదయ్‌ డిమాండ్‌ చేశారు. నల్లజర్లలో జీవో–39 కాపీలను తగలబెట్టారు. నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద  తెలుగు యువత జిల్లా కార్యదర్శి రెడ్డిం శ్రీను మాట్లాడుతూ పోలీస్‌, లైబ్రరీ, విద్యాశాఖల్లోని టీచర్ల పోస్టులను జాబ్‌ క్యాలెం డర్‌లో చూపించకపోవడం సరికాదన్నారు.ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌ లాగ్‌ పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలని కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొక్కెరపాటి రవీంద్ర, అందుగుల ఫ్రాన్సిస్‌ బుట్టాయగూడెంలో డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-06-23T05:38:38+05:30 IST