నవసమాజ స్థాపనలో యువత పాత్ర కీలకం

ABN , First Publish Date - 2021-03-01T04:11:21+05:30 IST

నవస మాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అన్నారు.

నవసమాజ స్థాపనలో యువత పాత్ర కీలకం
యువతను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రేంసాగర్‌రావు

-యువజన సదస్సులో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు
మంచిర్యాల, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): నవస మాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అన్నారు. పద్మనాయక ఫంక్షన్‌ హాలులో ఆది వారం ఏర్పాటుచేసిన యువజన సదస్సులో మాట్లా డారు. మార్పు యువతతోనే సాధ్యమని, నియోజక వర్గంలో రాజకీయ పక్షాళన చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు, గోదా వరి తలాపునే ఉన్నా ప్రజలకు తాగునీరు అందడం లేదన్నారు. ఇక్కడి పాలకుల చేతగానితనం వల్ల ప్రజలకు ఈ దుస్థితి పట్టిందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద నియోజకవర్గంలో సుమారు 30వేల ఎకరాలుండగా చుక్కనీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ నీళ్లు ఎప్పుడు వస్తా యో తెలియని పరిస్థితి ఉం దన్నారు. బీజేపీ, టీఆర్‌ ఎస్‌ కల్లబొల్లి మాటలు నమ్మవద్దని సూచించారు.  ప్రజలకు నిత్యం తాగు నీరు అందించడం తోపాటు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయిస్తానన్నారు. రాష్ట్రం లో లక్షా 90వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా యని, కాని అధికార పార్టీ  లెక్కల్లో భారీగా ఉద్యోగాలి చ్చినట్లు చెబుతున్నారని విమర్శించారు. యువతకు అవసరమైన యూనివ ర్సిటీ, ఐటీ టవర్స్‌ నెలకొల్పుతానని హామీ ఇచ్చారు. జిల్లా కాం గ్రెస్‌ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకటేనన్నారు. కేసీఆర్‌ కుటుంబ రాజకీయాలు చేస్తుంటే, మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతుందని ఆరోపించారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి సామాన్య ప్రజలపై అధికభారం మోపారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు అంకం నరేష్‌ అధ్య క్షతన జరిగిన సదస్సులో అధికార ప్రతినిధి సత్యనారా యణ, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ ఉప్పలయ్య, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్లు సంజీవ్‌, అబ్దుల్‌ మాజిద్‌, పెంట రజిత,  హేమలత, అబ్దుల్‌ సత్తార్‌,  బానేష్‌, కౌన్సిలర్లు,  పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T04:11:21+05:30 IST