ఎంత పని చేశావు బ్రదరూ.. Airforce కు సెలక్టయ్యావన్న ఆనందంలో నీ కుటుంబమంతా ఉంటే.. ఆమెకు భయపడి..

ABN , First Publish Date - 2021-10-12T23:08:05+05:30 IST

ఎంతో కష్టపడి ఆ యువకుడు ఎయిర్‌ఫోర్స్‌కు సెలెక్టయ్యాడు. ఇంకొన్ని రోజులైతే ఉద్యోగంలో చేరేవాడే. తల్లిదండ్రులు కూడా కొడుకు ఉద్యోగం సంపాదించాడని సంతోషంగా ఉన్నారు. కానీ ఎయిర్‌ఫోర్స్‌లో సెలెక్ట్ అయిన కొద్ది రోజులకే అతడు ఆమె బెదిరింపులకు భయపడి ఏం చేశాడంటే..

ఎంత పని చేశావు బ్రదరూ.. Airforce కు సెలక్టయ్యావన్న ఆనందంలో నీ కుటుంబమంతా ఉంటే.. ఆమెకు భయపడి..

ఎంతో కష్టపడి ఆ యువకుడు ఎయిర్‌ఫోర్స్‌కు సెలెక్టయ్యాడు. ఇంకొన్ని రోజులైతే ఉద్యోగంలో చేరేవాడే. తల్లిదండ్రులు కూడా కొడుకు ఉద్యోగం సంపాదించాడని సంతోషంగా ఉన్నారు. కానీ ఎయిర్‌ఫోర్స్‌లో సెలెక్ట్ అయిన కొద్ది రోజులకే అతడు ఆమె బెదిరింపులకు భయపడి ఏం చేశాడంటే..

జైపూర్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ శాస్త్రినగర్‌కు చెందిన సునిల్ కుమార్ మాథుర్‌ కొద్ది రోజుల క్రితం ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగానికి సెలెక్టయ్యాడు. ప్రస్తుతం అతడు జాబ్‌కు సంబంధించి పోలీసుల వెరిఫికేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే తనపై కేసు ఉందని, భవిష్యత్తు నాశనమైపోతుందని ఒత్తిడికి గురయ్యాడు. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా అతడు ఒత్తిడి నుంచి తేరుకోలేకపోయాడు. దీంతో సునిల్ మంగళవారం ఉదయం 5 గంటలకు తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

బాధితుడి తల్లి నీత మాథుర్ మాట్లాడుతూ.. గత కొద్ది రోజుల నుంచి తమ కుటుంబంతో ఆడపడచు అనిత, ఆమె భర్త భువనేశ్వర్‌ కుమార్‌లు ఆస్తి విషయంలో తగాదాలు పడుతున్నారని తెలిపింది. ఈ విషయంపై తాము కోర్టులో సివిల్ దావా కూడా వేశామని చెప్పింది. తన మామ చనిపోవడానికి ముందే అనిత భర్తతో కలిసి అమెరికా నుంచి వచ్చిందని తెలిపింది. తండ్రిని మోసం చేసి వీలునామా రాయించుకుందని, ఆ వీలునామా ఆధారంగా బ్యాంకులో ఉన్న ఆభరణాలన్నీ తీసుకెళ్లిందని చెప్పింది. అంతేకాకుండా తన కొడుకుపై కేసు కూడా వేసిందని, దాంతో పోలీసులు దర్యాప్తుకు రమ్మని లెటర్ పంపారని అన్నారు. ఉద్యోగంలో చేరే ముందు తన కొడుకుపై పోలీసు కేసు పెట్టడం వల్ల ఒత్తిడికి గురయ్యాడని, భవిష్యత్తు పట్ల ఆందోళన చెంది మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. 

Updated Date - 2021-10-12T23:08:05+05:30 IST