ఇండియన్‌ యాప్‌ను కొనుగోలు చేసిన యూట్యూబ్‌

Jul 24 2021 @ 00:21AM

గూగుల్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ అయిన ‘యూట్యూబ్‌’ ఇటీవలే భారతీయ యాప్‌ ‘సిమ్‌సిమ్‌’ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ యాప్‌ రెండేళ్ల క్రితం లాంచ్‌ అయింది. రాబోయే  వారాల్లో యాప్‌ పూర్తిస్థాయిలో చేతులు మారనుంది. స్థానిక వ్యాపార సంస్థల ఉత్పత్తులను తెలుసుకోవడానికి, కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు ఈ యాప్‌ ద్వారా అవకాశం కలుగుతుంది. హిందీ, తమిళం, బెంగాళీ భాషల్లో  వీడియోలు, రివ్వ్యూల ద్వారా  చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి బిజినెస్‌ పెంచడం ఈ యాప్‌ ఉద్దేశం. ఇండియాలో తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఇదో ఉదాహరణగా యూట్యూబ్‌ పేర్కొంది. పేటీఎంలో వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అమిత్‌ బగారియా, సౌరబ్‌ విశ్వనాథ్‌, ఫుడ్‌పాండాలో సీఓఓగా పనిచేసిన కునాల్‌ సూరీలు 2019లో ‘సిమ్‌సిమ్‌’ను ప్రారంభించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.