YouTubeలో చూసి నాటుబాంబుల తయారీ..వ్యక్తి అరెస్ట్
ABN , First Publish Date - 2021-10-28T13:39:37+05:30 IST
పుట్లూరు మండలంలో పోలీసులు రెండు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. మాడుగుపల్లి గ్రామానికి చెందిన నరేష్ కుమారెడ్డి అనే వ్యక్తి యూట్యూబ్ లో
అనంతపురం: పుట్లూరు మండలంలో పోలీసులు రెండు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. మాడుగుపల్లి గ్రామానికి చెందిన నరేష్ కుమారెడ్డి అనే వ్యక్తి యూట్యూబ్ లో చూసి నాటు బాంబులు తయారీ చేశాడు. విక్రయించేందుకు అనంతపురం తీసుకువెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నరేష్ ని అరెస్ట్ చేసి బాంబులను స్వాధీనం చేసుకున్నారు.