యూట్యూబ్‌ ‘షార్ట్స్‌’కు రోజూ 65 లక్షల హిట్స్‌

ABN , First Publish Date - 2021-05-01T05:30:00+05:30 IST

‘యూట్యూబ్‌’ టిక్‌టాక్‌గా పేరొందిన ‘యూట్యూబ్‌ షార్ట్స్‌’కు రోజూ 65 లక్షల హిట్స్‌ వస్తున్నాయి. రోజురోజుకు ఆదరణపొందుతోంది. గత ఏడాది మార్చి నెలాఖరునాటికి

యూట్యూబ్‌ ‘షార్ట్స్‌’కు రోజూ 65 లక్షల హిట్స్‌

‘యూట్యూబ్‌’ టిక్‌టాక్‌గా పేరొందిన ‘యూట్యూబ్‌ షార్ట్స్‌’కు రోజూ 65 లక్షల హిట్స్‌ వస్తున్నాయి. రోజురోజుకు ఆదరణపొందుతోంది. గత ఏడాది మార్చి నెలాఖరునాటికి రోజూ  35 లక్షల హిట్స్‌ ఉండేవి. ఈ ఫీచర్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో ఇండియాలో విడుదల చేసింది. ఆర్టిస్టులు, క్రియేటర్లు చిన్నపాటివి, అందునా  మొబైల్‌ ఫోన్లను ఉపయోగించుకునే తీసుకునేందుకు అనువుగా ఈ షార్ట్స్‌ ఉంది.


తదుపరి రోజుల్లో వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌ను సైతం  అమెరికాలో బేటా వెర్షన్‌లో తీసుకువచ్చింది. ప్రతి నెలా దీనికి రెండు బిలియన్ల మంది లాగ్‌ అవుతుండగా రోజూ ఒక బిలియన్‌ గంటల మేర వీక్షణలను రికార్డు చేస్తోంది. యూట్యూబ్‌ బ్రాండ్‌ బిజినెస్‌లో దీని ఎదుగుదల ఎక్కువగా ఉంది.

Updated Date - 2021-05-01T05:30:00+05:30 IST