కాగా.. ట్రంప్‌కు చెందిన అకౌంట్లపై ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విచ్, రెడ్డిట్ ఇప్పటికే వేటు వేశాయి. యూట్యూబ్ కూడా ఇదే నిర్ణయాన్ని అమలు చేయాలంటూ హాలీవుడ్ స్టార్లు, ఇతరు ప్రముఖుల నుంచి ఇటీవల కాలంలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ కూడా మిగతా సామాజిక మాధ్యమాల నిర్ణయాన్నే అమలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో హింస చెలరేగే అవకాశం ఉండటంతో ట్రంప్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఛానల్లోని కామెంట్ సెక్షన్ కూడా డిసేబుల్ చేసింది.