ప్రోడక్ట్‌ అమ్మకాల దిశగా యూట్యూబ్‌

ABN , First Publish Date - 2021-03-27T06:01:56+05:30 IST

వెబ్‌సైట్ల తరహాలోనే ‘యూట్యూబ్‌’ కూడా ప్రకటనలతో ఆదాయం పొందుతుందని అందరికీ తెలిసిందే. అదనపు ఆదాయం కోసం కొత్త సన్నాహాలు చేసుకుంటోంది ‘యూట్యూబ్‌’. ప్రోడక్ట్‌ అమ్మకాల ద్వారా ఆదాయం పెంచుకునే పనిలో ఉంది

ప్రోడక్ట్‌ అమ్మకాల దిశగా యూట్యూబ్‌

వెబ్‌సైట్ల తరహాలోనే ‘యూట్యూబ్‌’ కూడా ప్రకటనలతో ఆదాయం పొందుతుందని అందరికీ తెలిసిందే. అదనపు ఆదాయం కోసం కొత్త సన్నాహాలు చేసుకుంటోంది ‘యూట్యూబ్‌’. ప్రోడక్ట్‌ అమ్మకాల ద్వారా ఆదాయం పెంచుకునే పనిలో ఉంది.  అందుకుగాను వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువుల వీడియోలు చూసే సమయంలో  ప్రోడక్ట్‌ సమాచారం, సమీక్షలతో అదనపు సమాచారాన్ని అందజేస్తుంది.   వారికి ఇష్టం అయితే అక్కడి నుంచే వాటిని కొనుగోలు చేసేలా లింక్స్‌ కూడా ఉన్నాయని ‘9 టు 5’ గూగుల్‌ నివేదిక  తెలిపింది. ఈ లింక్‌లు వీక్షకులను సరైన ఈ కామర్స్‌ సైట్లకు లేదా ఇంకా బెస్ట్‌ వీడియోలు ఉండే  సైట్లవైపు పంపిస్తాయి. 


ఈ కొత్త ఫీచర్‌ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. ఇదంతా రికమండెడ్‌ వీడియోస్‌ అనే సమాచారం దగ్గర కనిపిస్తుంది. వీక్షకులు కిందకు స్ర్కోల్‌చేస్తే ఇది కనిపిస్తుంది. దీని ద్వారా వారు ఆయా వస్తువుకు సంబంధించిన మరింత సమాచారాన్ని, వీడియోలను పొందవచ్చు. ప్రస్తుతం అమెరికాలోని వీక్షకులకు దీనిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిస్థాయి ఆపరేషన్‌లోకి వస్తే ‘యూట్యూబ్‌’ కూడా ఈ కామర్స్‌గా మారిపోయినట్లే. 


బ్లూమ్‌బర్గ్‌ గత అక్టోబర్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఉత్పత్తుల అమ్మకాల్లోకి కూడా దిగాలని ‘యూట్యూబ్‌’కు గూగుల్‌కు సూచించింది. ఆటబొమ్మలు, ఎలకా్ట్రనిక్స్‌, దుస్తులు, కాస్మొటిక్స్‌ మొదలుకుని ఎన్నో రకాల  ఉత్పత్తుల వీడియోలు ‘యూట్యూబ్‌’లో ఉంటాయి.  ఈ ప్రొడక్ట్‌లు నచ్చి, వాటిని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుడిని అమెజాన్‌ను క్లిక్‌ చేయండి అని సూచించడానికి బదులు తనే ఈకామర్స్‌సైట్‌గా మారితే అమ్మకాలు చేపట్టవచ్చుని గూగుల్‌ చెబుతోంది. ఇప్పటికే గూగుల్‌ షాపింగ్‌ ఆరంభమైంది. పెద్దపెద్ద రీటైల్‌ స్టోర్స్‌ సమాచారం అంతా ఇందులో లభిస్తుంది.

Updated Date - 2021-03-27T06:01:56+05:30 IST