656 అడుగుల పైనుంచి పడిపోయిన యూట్యూబర్.. అతడి తల్లి ఏం చెప్పారంటే..

Jul 31 2021 @ 23:09PM

డెన్మార్క్‌కు చెందిన ఆల్బర్ట్ డైర్లండ్ అనే 22ఏళ్ల యూట్యూబర్ కొండ పైనుంచి పడి మరణించాడు. అతడి మరణాన్ని డైర్లండ్ కుటుంబం ధృవీకరించింది. ఇటలీలోని ఆల్ఫ్‌ పర్వతాల్లో విహార యాత్రకు వెళ్లిన డైర్లండ్.. వాల్ గార్డెనా ప్రాంతంలోని మౌంట్ సిసేడా వద్ద వీడియో తీస్తూ 656 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. అతడిని కాపాడేందుకు ఓ రెస్క్యూ హెలికాప్టర్ వెళ్లినప్పటికీ అతడిని సరైన సమయంలో కాపాడలేకపోయారు. దీంతో డైర్లండ్ ప్రమాద స్థలంలోనే మరణించాడు.

డైర్లండ్ మృతిపై అతడి తల్లి జొర్జెర్ జెన్సెస్ మీడియాతో మాట్లాడుతూ.. తాము తీవ్ర ఆవేదనలో ఉన్నామని, అయితే తమ బిడ్డ మరణ వార్త అతడి ఫ్యాన్స్‌కు తెలియాలనే ఆలోచనతోనే ఈ విషయం చెబుతున్నామని పేర్కొన్నారు. అయితే ఈ బాధలో తమకు కొంత ప్రైవసీ కావాలని కోరారు. రిపోర్టుల ప్రకారం డైర్లండ్ బుధవారం మరణించాడు. అతడి మరణాన్ని డెన్మార్క్ విదేశీ మంత్రిత్వశాఖ కూడా స్పష్టం చేసింది. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...