ఓ సామాన్యుడు.. 7 నిమిషాల పాటు అపరకుబేరుడిగా.. ఎలాన్ మస్క్‌నూ వెనక్కు నెట్టి.. ఇదంతా ఎలా జరిగిందంటే...

ABN , First Publish Date - 2022-02-19T02:48:44+05:30 IST

ఎలాన్ మస్క్‌ను వెనక్కు నెట్టేశా.. కేవలం 7 నిమిషాల పాటు ప్రపంచంలో నెం.1 కుబేరుడిగా నిలిచా అంటూ ఓ యూట్యూబర్ చేసిన వ్యాఖ్య ప్రస్తుతం ఇంటర్నెట్‌ను చుట్టేస్తోంది. ఇదంతా ఎలా సాధ్యమైందో చెబుతూ

ఓ సామాన్యుడు.. 7 నిమిషాల పాటు అపరకుబేరుడిగా.. ఎలాన్ మస్క్‌నూ వెనక్కు నెట్టి..  ఇదంతా ఎలా జరిగిందంటే...

ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్‌ను వెనక్కు నెట్టేశా.. కేవలం 7 నిమిషాల పాటు ప్రపంచంలో నెం.1 కుబేరుడిగా నిలిచా అంటూ ఓ యూట్యూబర్ చేసిన వ్యాఖ్య ప్రస్తుతం ఇంటర్నెట్‌ను చుట్టేస్తోంది. ఇదంతా ఎలా సాధ్యమైందో చెబుతూ ఆ యూట్యూబర్ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో రూపొందించిన ఆ వ్యక్తి పేరు మ్యాక్స్ ఫాక్స్, ఉండేది బ్రిటన్‌లో! అతడు చెప్పిన వివరాల ప్రకారం.. ముందుగా ఫాక్స్ బ్రిటన్‌లో ఓ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. అక్కడ ఇలాంటి కంపెనీ పెట్టడం చాలా సులువు! ఈ క్రమంలో 10 బిలియన్ షేర్లు అమ్ముతానని, ఒక్కో షేరు ధర 50 పౌండ్లని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత.. అతడు కంపెనీని రిజిస్టర్ చేయడంతో ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ అతడిని చేరిపోయాయి. ఆ తరువాత.. ఓ వీధిలో చిన్న టేబుల్ వేసుకుని తన కంపెనీ గురించి వచ్చీ పోయే వారికి వివరిస్తూ తన సంస్థలో పెట్టుబడి పెట్టాలని కోరారు. చివరికి ఓ మహిళ 50 పౌండ్లతో ఓ షేరును కొనుగోలు చేసింది కూడా! 


ఇది జరిగిన కొద్ది రోజులకు అధికారుల నుంచి అతడికి ఓ లేఖ వచ్చింది. మ్యాక్స్ ఏర్పాటు చేసిన కంపెనీ మార్కెట్ విలువ అతడు ఊహించినట్టుగా 500 బిలియన్ డాలర్ల వరకూ ఉండొచ్చని, అయితే.. కంపెనీకి ఆదాయం వచ్చే మార్గాలేవీ లేకపోవడంతో ఇదంతా ప్రజల్ని మోసపుచ్చే ప్రయత్నంగా భావించాల్సి వస్తుందని అధికారులు తమ లేఖలో పేర్కొన్నారు. దీంతో.. ఆలోచనలో పడ్డ అతడు తనకు ఈ తలనొప్పి అంతా ఎందుకు అనుకుని కంపెనీని ఎత్తేశాడు. కేవలం 7 నిమిషాల్లోనే దుకాణం కట్టేశాడు. ఆ తరువాత.. మహిళ వద్ద తీసుకున్న 50 పౌండ్లను కూడా ఆమెకు తిరిగిచ్చేశాడు. ఇవన్నీ వివరిస్తూ అతడు చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Updated Date - 2022-02-19T02:48:44+05:30 IST