Advertisement

ఆ వీడియోల్లో అంతలేదు?.. నటుడు అక్షయ్ కుమార్‌ను హెచ్చరించిన యూట్యూబర్!

Nov 21 2020 @ 19:19PM

ముంబై: బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ తనకు పంపిన రూ. 500 కోట్ల పరువునష్టం దావా నోటీసులపై యూట్యూబర్ రషీద్ సిద్దిఖి స్పందించాడు. తాను అప్‌లోడ్ చేసిన వీడియోల్లో అక్షయ్‌ పరువుకు నష్టం కలిగించేలా ఏమీ లేదని స్పష్టం చేశాడు. అంతేకాదు, ఆ నోటీసులను వెనక్కి తీసుకోవాలని, లేదంటే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. 


యువనటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి వ్యవహారంలో రషీద్ తన ఎఫ్ఎఫ్ న్యూస్ యూట్యూబ్ చానల్‌లో తనపై ‘తప్పుడు, నిరాధార ఆరోపణల’తో వీడియోలు చేశాడని ఆ నోటీసుల్లో పేర్కొన్న అక్షయ్.. తద్వారా తన పరువుకు భంగం కలిగించినందుకు గాను రూ. 500 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న రషీద్‌కు నోటీసులు పంపాడు. 

 

అక్షయ్ నోటీసులపై స్పందించిన రషీద్.. తన న్యాయవాది ద్వారా అక్షయ్ కుమార్‌కు నోటీసులు పంపాడు. అక్షయ్ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చిన రషీద్.. తనను అణచివేసేందుకు, వేధించేందుకు ఉద్దేశపూర్వకంగానే అక్షయ్ నోటీసులు పంపినట్టు పేర్కొన్నాడు. దేశంలోని ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని గుర్తు చేశాడు. రషీద్ సిద్దిఖి అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను పరువు నష్టం కలిగించేదిగా పరిగణించలేమని, వాటిని నిష్పాక్షిక దృక్కోణాలుగా పరిగణించాల్సి ఉంటుందని అతడి తరపు న్యాయవాది ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.