Jagan Viral Video: అక్కడ ఎవరూ లేరు కద సార్.. వైరల్ అవుతున్న జగన్ వీడియో..!

ABN , First Publish Date - 2022-06-27T23:23:15+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రూటే సపరేటు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబును కాల్చి చంపాలని..

Jagan Viral Video: అక్కడ ఎవరూ లేరు కద సార్.. వైరల్ అవుతున్న జగన్ వీడియో..!

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రూటే సపరేటు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబును కాల్చి చంపాలని కామెంట్లు చేయడం, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అని వెంట్రుక భాషలో మాట్లాడటం ఆయనకే చెల్లింది. వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో జగన్ కొన్ని నెలలుగా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అయితే.. హెలికాఫ్టర్‌లో అలా వచ్చి ఇలా వెళ్లిపోతుండటమే తప్ప తమతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదని జగన్‌పై ఇటీవల తీవ్ర విమర్శలొస్తున్నాయి.



ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోకుండా పర్యటనలు సాగిస్తున్న జగన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు జగన్ ప్రవర్తన చూసి విస్తుపోతూ విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. జగన్ తీరును చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. అంతలా ఆ వీడియోలో ఏముందంటే.. ఆ వీడియోలో జగన్‌తో పాటు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి రోజా ఉన్నారు. ఆలయ సందర్శనకు సంబంధించిన వీడియోగా అర్థమవుతోంది. ఆ వీడియోలో జగన్ ఆలయం వెలుపల నిల్చుని కింద ఉన్నవారికి అభివాదం చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. కింద ఎవరికి ఆయన అభివాదం చేస్తున్నారా అని చూస్తే అక్కడ ఎవరూ లేరు.



జనం లేకపోయినా జగన్ ఆయనకు మాత్రమే అక్కడున్న వారు కనిపిస్తున్నట్టుగా దణ్ణం పెడుతున్న వీడియో చూసి నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు. అసలు అక్కడ ఎవరున్నారని జగన్ చేతులెత్తి మరీ దణ్ణం పెడుతున్నారో అర్థం కాక బుర్ర బాదుకుంటున్నారు. జగన్‌కు పబ్లిసిటీ పిచ్చి ఏ రేంజ్‌లో ఉందో చూడండని ప్రత్యర్థి పార్టీలు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. ఈ వీడియోను కొన్ని మీమ్స్ పేజ్‌లు ఎడిట్ చేసి తమదైన శైలిలో నవ్వులు పూయిస్తున్నాయి. ఖలేజా సినిమాలో ‘అక్కడ ఎవరూ లేరు కద సార్’ అని బ్రహ్మానందం చెప్పే డైలాగ్‌ను ఈ వీడియోతో మిక్స్ చేసి.. ఎడిట్ చేసి ‘జస్ట్ ఫర్ ఫన్’ అని మీమ్స్ పేజ్‌లు కొన్ని వైరల్ చేస్తున్నాయి. అయితే.. జగన్‌కు సంబంధించిన ఈ వీడియోను కావాలనే ఎడిట్ చేశారని.. జనం లేనట్టుగా చూపిస్తున్నారని వైసీపీ శ్రేణులు ఈ వైరల్ వీడియోను కొట్టిపారేస్తున్నాయి. ఏదేమైనా జగన్ పర్యటనకు సంబంధించిన ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2022-06-27T23:23:15+05:30 IST