వ్యవసాయ పంటలకు రూ.113.11 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల

ABN , First Publish Date - 2020-10-26T23:46:16+05:30 IST

వ్యవసాయ పంటలకు రూ.113.11 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల

వ్యవసాయ పంటలకు రూ.113.11 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల

అమరావతి: వ్యవసాయ పంటలకు రూ.113.11 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసింది. వరదల వల్ల నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించనున్నారు. కృష్ణా, గోదావరి, కుందూ వరదలతో దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ వర్తించనుంది. 33 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశారు. ఉభయగోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సబ్సిడీని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.  ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లో వేయాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలకు రూ.22.59 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లిస్తారు. మే-సెప్టెంబర్ మధ్య వరదలకు నష్టపోయిన ఉద్యాన పంటలకు కూడా చెల్లించనున్నారు. విజయనగరం, ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లా ఉద్యానపంటల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించనున్నారు. 

Updated Date - 2020-10-26T23:46:16+05:30 IST