వైఎస్ షర్మిల ఎదుట నిరుద్యోగ యువతి ఆవేదన

ABN , First Publish Date - 2021-10-24T00:08:22+05:30 IST

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ 4వ రోజు కొనసాగింది. శంషాబాద్ మండలం గొల్లపల్లిలో జనంతో ....

వైఎస్ షర్మిల ఎదుట నిరుద్యోగ యువతి ఆవేదన

రంగారెడ్డి: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’  4వ రోజు కొనసాగింది. శంషాబాద్ మండలం గొల్లపల్లిలో జనంతో మమేకం అవుతూ..బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్ట, నష్టాలను ఆమె తెలుసుకున్నారు. పెద్దగోల్కొండలో ఓ నిరుద్యోగి షర్మిల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉన్నత చదువు చదివానని, ప్రభుత్వ ఉద్యోగాలకు సీఎం కేసీఆర్ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల  ప్రైవేటు జాబ్ చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆమె వాపోయారు. 


ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ‘‘ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్. మహిళలకు ఉపాధి లేదు. పేదలకు ఇండ్లు లేవ్. వృద్ధులకు పెన్షన్లు లేవ్. అర్హులకు రేషన్ కార్డుల్లేవ్. ప్రజాప్రస్థానంలో ప్రజలు చెప్తున్న బాధలు అన్నీఇన్నీ కావు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలూ తీరుస్తా.. ప్రజలకు అండగా నిలబడతా. వైఎస్ సంక్షేమ పాలనే లక్ష్యంగా ముందుకు పోతున్నాం’’ అని అన్నారు. 




Updated Date - 2021-10-24T00:08:22+05:30 IST