వైఎస్సార్ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ: Sharmila

ABN , First Publish Date - 2022-07-01T01:24:07+05:30 IST

సూర్యాపేట: వైఎస్సార్ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావించిందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. మాట - ముచ్చట కార్యక్రమంలో భాగంగా పెన్ పహాడ్ మండలం ఆనంతారం గ్రామస్థులతో ఆమె మాట్లాడారు.

వైఎస్సార్ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ: Sharmila

సూర్యాపేట: వైఎస్సార్ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావించిందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. మాట -  ముచ్చట కార్యక్రమంలో భాగంగా పెన్ పహాడ్ మండలం ఆనంతారం గ్రామస్థులతో ఆమె మాట్లాడారు. కేసీఆర్ పాలనలో వృద్ధులు, వికలాంగులు పింఛన్లు అందక ఇబ్బంది పడుతున్నారని, కౌలు రైతు పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ. 70 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటే ఎందుకు బయట పెట్టడం లేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజన్న రాజ్యం తిరిగి తెచ్చేందుకు తనను ఆశీర్వదించాలని కోరారు. 

Updated Date - 2022-07-01T01:24:07+05:30 IST