YSR Vardhanthi.. అది ఒక్క వైఎస్సార్‌కే దక్కింది: ఉండవల్లి అరుణ్ కుమార్

ABN , First Publish Date - 2022-09-02T17:35:20+05:30 IST

వైఎస్ రాజశేఖర్ రెడ్డి దూరమై 13ఏళ్లు అయ్యిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

YSR Vardhanthi.. అది ఒక్క వైఎస్సార్‌కే దక్కింది: ఉండవల్లి అరుణ్ కుమార్

కృష్ణా జిల్లా (Krishna Dist.): వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) దూరమై 13ఏళ్లు అయ్యిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) అన్నారు. శుక్రవారం వైఎస్ఆర్ వర్ధంతి (YSR Vardhanthi) సందర్భంగా కృష్ణాజిల్లా, అంపాపురంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ప్రయాణించిన హెలికాప్టర్ జాడ తెలియక ఆందోళన చెందామని, ఆరోజు రాత్రి అన్ని పార్టీలు, అన్ని వర్గాల వారు జాగారం చేశామన్నారు. వైఎస్సార్ బతికి వెనక్కి రావాలని అందరూ పూజలు చేశారన్నారు. ఆయన మరణవార్త విని కోట్ల మంది ప్రజలు కన్నీరు పెట్టారని, జగతిలో అది ఒక్క వైఎస్సార్‌కే దక్కిందని ఉండవల్లి అన్నారు. చనిపోయే వరకు పేదల కోసం ఆలోచించిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి అని, ఆయన మరణం తరువాత ఏపీ (AP) అస్తవ్యస్తంగా మారి ఎలా అయ్యిందో మనం చూస్తున్నామన్నారు. ఆ ఒక్క వ్యక్తి లేకపోవడంతో పేదల జీవితాలు తారుమారు అయ్యాయన్నారు. ‘‘వైఎస్సార్, కేవీపీ (KVP) రెండు కాదు..‌ఇద్దరూ ఒక్కటే.. వైఎస్ మరణంతో కేవీపీ మోములో నవ్వే లేకుండా పోయింది.. వైయస్సార్ ఎక్కడ ఉన్నా... కాలు మీద కాలు వేసుకుని ఉన్నాడని భావిస్తున్నా.. నేటి పాలకులు కూడా వైయస్సార్ పాలనను ఆదర్శంగా తీసుకుని పేదలకు మంచి చేయాలి’’అని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-09-02T17:35:20+05:30 IST