ఏజెంట్లను గెంటేస్తున్న పోలీసులు..
మరోవైపు.. అనంత జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ ఏజెంట్లను పోలీసులు బయటకు పంపుతున్నారు. ఏజెంట్‌గా కూర్చుంటే కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు.. కనగానపల్లి మండలం ఎలక్కుంట్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం నుంచి టీడీపీ ఏజెంట్‌ను గెంటివేశారు. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలోనూ టీడీపీ ఎన్నికల ఏజెంట్ వెంకటేష్‌పై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు లక్ష్మీరెడ్డి, ఆదినారాయణ దాడికి దిగారు.