Kuppam: విశాల్ పాయె.. భరత్ వచ్చె.. కుప్పంలో చంద్రబాబుపై బరిలో ఉన్నానంటున్న ఈ భరత్ ఎవరంటే..

ABN , First Publish Date - 2022-07-01T05:14:46+05:30 IST

వైసీపీ నేతలు ఇటీవల ఉద్దేశపూర్వకంగా ఓ నియోజకవర్గం పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఆ నియోజకవర్గం మరేదో కాదు.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేగా...

Kuppam: విశాల్ పాయె.. భరత్ వచ్చె.. కుప్పంలో చంద్రబాబుపై బరిలో ఉన్నానంటున్న ఈ భరత్ ఎవరంటే..

వైసీపీ (YCP) నేతలు ఇటీవల ఉద్దేశపూర్వకంగా ఓ నియోజకవర్గం పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఆ నియోజకవర్గం మరేదో కాదు.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం (Kuppam). వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని వైసీపీ (YCP) కంకణం కట్టుకుంది. అందుకోసం ఇప్పటి నుంచే సామ,దాన,భేద,దండోపాయాలను ప్రయోగించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. కుప్పంలో (Kuppam) చంద్రబాబును ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఏకంగా తమిళ సినీ నటుడు విశాల్‌తో (Vishal) సంప్రదింపులు జరిపింది. వైసీపీ సోషల్ మీడియా పేజ్‌ల్లో (YCP Social Media) కూడా చంద్రబాబుపై (Chandra Babu) పోటీకి ఈసారి వైసీపీ (YCP) తరపున విశాల్ (Vishal) బరిలో నిలవబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.



విశాల్ (Vishal) సామాజిక వర్గం, జగన్ (Jagan) సామాజిక వర్గం ఒకటే కావడంతో పాటు విశాల్ (Vishal) కుటుంబానికి కుప్పం (Kuppam) ప్రాంతంతో సంబంధాలు కూడా ఉండటంతో ఇది ఉత్తుత్తి ప్రచారం కాదని.. చంద్రబాబుపై (Chandra Babu) జగన్ ప్రయోగించబోతున్న అస్త్రం విశాలేనని ప్రచారం జోరుగా సాగింది. విశాల్ (Vishal) కూడా వైసీపీ (YCP) విషయంలో, జగన్ (Jagan) విషయంలో మొదటి నుంచి కొంత సానుకూల వైఖరితో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో.. విశాల్ (Vishal) పాటల స్టేటస్‌లతో వైసీపీ (YCP) యువ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో (Social Media) హడావుడి చేశారు. వైసీపీ శ్రేణులు (YCP Cadre) విశాల్‌ రెడ్డి కుప్పం వైసీపీ అభ్యర్థి ( Kuppam YCP Candidate) అని అంత పెద్ద ఎత్తున పనిగట్టుకుని ప్రచారం చేస్తే వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) మాత్రం ఈ వార్తలను ఖండించడం కొసమెరుపు. 2024లో కుప్పంలో (Kuppam) చంద్రబాబుపై (Chandra Babu) పోటీ చేసే వైసీపీ అభ్యర్థి భరత్ (YCP Candidate Bharat) మాత్రమే అని పెద్దిరెడ్డి (Peddireddy) ప్రకటించారు. ఇదిలా ఉండగా.. కుప్పంలో (Kuppam) చంద్రబాబును (Chandra Babu) ఓడించడం వైసీపీ (YCP) భావిస్తున్నంత తేలిక కాదని ఆ నియోజకవర్గ గత ఫలితాలను చూస్తే ఇట్టే అర్థమవుతోంది. టీడీపీకి (TDP) కంచుకోట లాంటి కుప్పంలో (Kuppam).. చంద్రబాబుపై (Chandra Babu) పోటీకి సరైన అభ్యర్థి దొరక్క ప్రత్యర్థి పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.



కుప్పం (Kuppam) నియోజకవర్గంపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై (Chandra Babu) పోటీ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి కె.చంద్రమౌళి మరణించారు. దీంతో.. ఆయన కుమారుడైన భరత్‌ను కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా (Kuppam YSRCP Incharge) అధిష్టానం నియమించింది. భరత్ వన్నెకుల క్షత్రియ (Vannekula Kshatriya) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, కుప్పంలో (Kuppam) ఆ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో భరత్‌నే అభ్యర్థిగా ప్రకటిస్తారని కుప్పం నియోజకవర్గంలో (Kuppam Assembly Constituency) టాక్. అయితే.. నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు కచ్చితంగా టికెట్ ఇస్తారన్న గ్యారెంటీ వైసీపీలో (YCP) లేదు. నియోజకవర్గ ఇంఛార్జ్‌లను పక్కన పెట్టి మరీ 2019 ఎన్నికల్లో కొందరికి టికెట్లు ఇచ్చిన చరిత్ర వైసీపీది. దీంతో.. కుప్పం అభ్యర్థి (Kuppam Candidate) విషయంలో పెద్దిరెడ్డి మాటలను శాసనంగా భావించలేం.



కుప్పం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను (Kuppam Election Results) ఒక్కసారి పరిశీలిస్తే.. 1989 నుంచి చంద్రబాబు నాయుడే (Chandra Babu Naidu) కుప్పం ఎమ్మెల్యేగా (Kuppam MLA) కొనసాగుతున్నారంటే ఆ నియోజకవర్గంలో ఆయనకు ఉన్న ఆదరణ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క కుప్పం నియోజకవర్గాన్ని (Kuppam Assembly Constituency) మినహాయిస్తే 13 స్థానాలను వైసీపీ (YCP) కైవసం చేసుకుంది. చంద్రబాబు నాయుడిని (Chandra Babu Naidu) మాత్రం వైసీపీ (YCP) ఓడించలేకపోయింది. దీంతో.. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తి స్థాయిలో కుప్పంపై (Kuppam) ఫోకస్ పెట్టాలని జగన్ (Jagan) ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. ఏదేమైనా.. వైసీపీకి (YCP) మిగిలిన 174 స్థానాల కంటే కుప్పం అసెంబ్లీ స్థానం (Kuppam Assembly Constituency) ‘సై’ అంటూ సవాల్ విసురుతోందని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Updated Date - 2022-07-01T05:14:46+05:30 IST